మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు సమత ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ ను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం హౌసింగ్ బోర్డ్ కాలనీ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు ఆహ్వానించారు ఈ మేరకు శనివారం వారి నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 3న రామగుండం కార్పొరేషన్ 1 వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆవిష్కరించనున్న అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సమతా సైనిక దళ్ సభ్యులంతా తప్పక హాజరు కావాలని కోరారు. అనంతరం నగేష్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. తను ఈ కార్యక్రమానికి సమతా సైనిక సభ్యులతో తప్పక హాజరవుతానని అదే విధంగా తమ వంతు సమతా సైనిక దళ్ ,సమతా ఫౌండేషన్ ల ద్వారా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కల్వల శ్రీనివాస్,కమిటీ సభ్యులు ఆరుముళ్ళ దుర్గాప్రసాద్, ఆరుముళ్ల బాపు,ఆరుముళ్ల సదానందం,గొట్టే తిరుపతి,కల్వల మహేందర్, ముల్కల రాజయ్య,అరుముళ్ల రాజయ్య,ఈదునూరి పోచం, ఒడ్డెపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: