మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్


మహాదేవపూర్/భూపాలపల్లి: జిల్లా భూ పోరాట కేంద్రం నుండి గోదావరిఖని లో జరుగుతున్న భూ పోరాట కేంద్రానికి సంఘీభావం తెలపడానికి వెళ్తున్న రెడ్ షర్ట్ వాలంటరీస్ కు మంథని సిపిఎం నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికి, మంథని చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి మంథని లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాలలో భూమిలేని నిరుపేదలకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేసి భూ పోరాటాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మంథని లో అర్హులైన పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని గతంలో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని తెలియజేశారు. ఇప్పటివరకు కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. మంథనిలో సొంత ఇంటి స్థలాలు లేక పేదలు కిరాయికుంటూ, కిరాయి చెల్లించ లేనటువంటి పరిస్థితులలో కుటుంబాలు చిన్నాభిన్నమైతున్నాయని అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి, గోదావరిఖని కేంద్రాలలో  జరుగుతున్న భూ పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని, మంథనిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో  నిర్వహించే భూ పోరాటాలకు ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్ల సందీప్,పొలం రాజేందర్, బావు రవి, శ్రీకాంత్, కోమల, శ్రావ్య,నాయకులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: