పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:గోదావరిఖని:ఏప్రిల్:10:బసంత్ నగర్ లో ఐఏఎస్ అధికారితో కలిసి వైద్యశాల ఉచిత కంటి దవఖాన ప్రారంభోత్సవం. ఐఏఎస్ అధికారి నరహరి సేవా సంకల్పం గొప్పదని పుట్టిన ఊరు కోసం సేవా కార్యక్రమలు చేయడం అభినందనీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు సోమవారం బసంత్ నగర్ లో పేదలకు ఉచిత కంటి వైద్య సేవల కోసం రూపాయలు యాభై లక్షలతో నిర్మించిన పరికిపండ్ల సత్యనారాయణ స్మారిక శంకర్ విజిన్ సెంటర్ ను ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు నరహరి రామగుండం నియోజకవర్గం లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో జిల్లాలలో ఆలయ ఫౌండేషన్ పేరుట అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఇక్కడ కంటి చికిత్స కేంద్రం ఏర్పాటుతో మరింత ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.జన్మించిన ఊరు మమకారం కోసం నరహరి అతని కుటుంబ సభ్యులు స్నేహితులు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే కోరుకొండ చందర్ పేర్కొన్నారు,చదువుతూనే సమాజంలో మంచి హోదా గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న స్కాలర్షిప్ లతో మంచి చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలిపారు.గత 12 ఏళ్ల నుంచి ఆలయ ఫౌండేషన్ పేరుతో దివ్యాంగులకు తలసేమి వ్యాధిగ్రస్తులకు రక్త శిబిరాలు ఏర్పాటు చేసి.ఆదరభిమాన్యాలు పొందుతున్నారని 1992 ఎస్ఎస్సి బ్యాచ్ స్నేహితులతో కలిసి సేవా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు,శంకర్ విజన్ సెంటర్ ద్వారా ఈ ప్రాంతంలో ఉచిత కంటి చికిత్స చేయించి ఆపరేషన్లు చేస్తామన్నారు. అంతకుముందు వేదికపై సినీ నటుడు ఆలీ గాయకులు మంగ్లీ, రమేషు,లక్ష్మి,మిమిక్రీ ఆర్టిస్ట్ రమేషు కాసర్ల శ్యామ్ తదితరులు ఆటపాటలతో అలరించారు.ఇక్కడ ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ కోర్ కంటి చందర్ బిజెపి రఘునందరావు మాజీ ఎమ్మెల్యే సోమారం సత్యనారాయణ జెడ్పిటిసి కందుల సంధ్యారాణి.జగిత్యాల మాజీ చైర్ పర్సన్.నరహరి తల్లి సరోజన సోదరులు రామ్ లక్ష్మణ్ శ్రీనివాస్ సోదరి శ్రీదేవి లు ఈ కార్యక్రమాన్ని అన్ని విధాల విజయవంతంగా కొనసాగించారు. పెద్దపల్లి సిఐ,బసంత్ నగర్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు పర్యవేక్షణ చేశారు,ఈ కార్యక్రమంలో దవాఖాన సిబ్బంది ఆలయ ఫౌండేషన్ వాలంటరీస్ దీనికి సంబంధించిన సభ్యులు తదితరులు పాల్గొన్నారు


Post A Comment: