మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం, కాళేశ్వరం విఐపి ఘాట్ రోడ్, నది తీర ప్రాంతంలో గల గుడి మాన్యం వ్యవసాయ భూమి, గత గోదావరి పుష్కరాల నుండి నేటి వరకు, ఇతర అవసరాల, వినియోగ కారణాలతో తాత్కాలికంగా వ్యవసాయం సాగు నిలిపి వేశారు.ఇలా నిలిపివేయడంతో, సంవత్సరాలు గడుస్తున్న కొద్ది, చిన్న చిన్న చెట్లు మొలచి, పెద్ద పెద్ద వృక్షాలవడంతో, సాగు భూమి బీడు భూమిగా మారింది. దేవస్థానం నూతన పాలకవర్గం చొరవ తీసుకొని, బీడు భూమిగా మారిన గుడిమాన్యం భూమిని, మళ్లీ వ్యవసాయ క్షేత్రంగా పునః ప్రారంభించడానికి, నేటి శుక్రవారం రోజున జెసిబి తో వృక్షాలను తొలగించి, చదును చేయించడం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ లింగంపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్ వసంత, ఆలయ ధర్మకర్తలు కామిడి రాంరెడ్డి, సమ్మయ్య, దేవేందర్, భాను ప్రకాష్, మాజీ డైరెక్టర్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
Post A Comment: