మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
సిర్పూర్(టి), ఏప్రిల్ 20: మండలకేంద్రంలోని ధనలక్ష్మి జువెల్లర్స్‌లో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం ముందుగల సీసీకెమెరాలకు టేపుచుట్టి షాపుషటర్లు పగులగొట్టి రూ.14లక్షల విలువ గల ఆభరణాలతో పాటు నగదు చోరీకి పాల్పడ్డారు. ఉదయం పాలు అమ్మే వ్యక్తితోపాటు చుట్టు పక్కల వారు గమనించి షాపు యజమాని పైడి సాయిరాంకు సమాచారం అందించారు. దీంతో ఆయన అక్కడికి చేరుకుని 100కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి సీఐ సాదిక్‌పాషా, ఎస్సై దీకొండ రమేష్ చేరుకుని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేపట్టారు. జాగిలాలు దుకాణం నుంచి రైల్వే స్టేషన్ వైపు వెళ్లాయి. అయితే దొంగలు ఈ రహదారి ఉండా పారిపోయి ఉండవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా 31తులాల బంగారం, 12కిలోలవెండి, రూ.2లక్షల నగదుచోరీకి పాల్ప డ్డారని బధితుడు ఫిర్యాదు చేశాడు. దుకాణం యజమాని సాయిరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ, ఎస్సైలు తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ కరుణాకర్ పరిశీలించారు. దొంగలు మహారాష్ట్ర వైపు నుంచి వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
Post A Comment: