ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీ మరమతులకు రూ.2 కోట్ల 5 లక్షల 50 వేలు మంజూరు చేయించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ బుధవారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులను కాకతీయ మెడికల్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్, జూనియర్ డాక్టర్స్ హాస్టల్ మరమ్మతులతో పాటు పీ జీ హాస్టల్ ఫర్నీచర్ కోసం వినియోగించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందన్నారు. కాగా, పనులు నాణ్యంగా జరిగేలా చూసి, నిధులను సద్వినియోగం చేయాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.

Post A Comment: