మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్గాం టౌన్ లో ర్యాలీ తీసి మండల కేంద్రంలోని సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో "పి ఓ డబ్ల్యు" జిల్లా కమిటీ ఆధ్వర్యంలో "సదస్సు" నిర్వహించారు. ఈ యోక్క సదస్సు కు..ముఖ్య అతిధిగా POW జిల్లా అద్యక్షురాలు కోడిపుంజుల జ్యోతి, మరియు CPI(M-L) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఐ క్రిష్ణ మాట్లాడుతూ... మహిళల పోరాట స్పూర్థి తో అంతర్జాతీయ మహిళా పోరాట దినం ఉద్భవించిందని మార్చి 8 మహిళల హక్కుల పోరాట స్ఫూర్తికి ప్రత్యేకం అని అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 1908 మార్చి 8న సోషలిస్టు మహిళల ఆధ్వర్యంలో వేలాదిమంది మహిళలు పని గంటల తగ్గింపు కోసం పని స్థలాల్లో పరిస్థితుల మెరుగుదల కోసం అలాగే జాతి మత వర్గ తారతమ్యం లేకుండా స్త్రీలందరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్స్ తో భారీ ప్రదర్శన నిర్వహించారు, నిర్బంధానికి గురయ్యారు పోరాటాల ఫలితంగా విజయాలు సాధించారు ఈ నేపథ్యంలో 1910 లో డెన్మార్క్ రాజధాని ఓపెన్ అగైన్ లో సోషలిస్టు మహిళ రెండవ అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు, ఈ సదస్సులో జర్మన్ కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు క్లారా జట్కిన్ మహిళా ఉద్యమాల స్ఫూర్తిగా మార్చి 8 మహిళా హక్కుల దినముగా పాటించాలని పిలుపునిచ్చారు, ఆనాటి నుండి ఈ పిలుపును ముందుగా కమ్యూనిస్టు దేశాలు పాటించాయి,

ఆ తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలు ఈనాడు మార్చి 8ని అంతర్జాతీయ మహిళా పోరాట దినంగా గుర్తిస్తూ అమలు జరుపుతున్నాయి.

ఈ సంవత్సరం "ప్రగతిశీల మహిళా సంఘం" రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపులో భాగంగా శ్రీ పురుషుల సమానత్వం పై పోరాడుదాం అని పురుషాధిపత్యాన్ని స్థిరీకరిస్తున్న మనువాదాన్ని తిప్పి కొడదామని పిలుపునిచ్చింది, మహిళా హక్కులపై గతంలో ఎన్నడూ లేనంతగా దాడులు కొనసాగుతున్నాయి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో కులమత వర్గ వివక్షను పెంచి పోషిస్తున్నాయి అన్నారు, మహిళల పట్ల మహిళల హక్కుల పట్ల గతంలో ఎన్నడు లేనంతగా దాడులు జరుగుతున్నాయని కేంద్రంలో రాష్ట్రంలో ఒక మహిళలపైనే కాకుండా దళితులపై మైనారిటీలపై దాడులకు ఆర్ఎస్ఎస్, బిజెపి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.

 అలాగే నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని ఉపాధి అవకాశాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ పెరిగిన జాడలేదని పట్టణ ప్రాంతాల్లో గతంలో ఎన్నడు లేనంతగా ఏ హక్కులు లేని అసంఘటితరంగా కార్మికులు పెరిగారని విద్య ప్రైవేటీ కరణతో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలుమూసివేయబడ్డాయని ఫీజులు చెల్లించి చదువు కొనలేని మహిళల విద్య అవకాశాలు కుచించుకు పోతున్నాయని అన్నారు, ప్రభుత్వాలు ప్రజల మధ్య విభేదాలను సృష్టిస్తూ గొడవలు పెడుతున్నారని మనుధర్మ శాస్త్రం పునరుద్ధరణకు పూనుకున్నారని అన్నారు, మనుధర్మం స్త్రీలను పురుషాధిపత్యానికి బలి చేస్తుందన్నారు, కులాలు మతాలకు అతీతంగా ప్రేమ వివాహాలు చేసుకునే స్త్రీ పురుషులపై దాడులను పురికొల్పుతుందని అన్నారు, 

 ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మహిళలు చైతన్యవంతంతో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు, ఈ మహిళా సదస్సులో POW నాయకులు డి బుచ్చక్క, కే సత్తేక్క, సి హెచ్ మంగ, కే అమ్రృత, డి పద్మ, యు ఉజ్వల, CPI (M-L) న్యూడెమోక్రసీ నాయకులు కొల్లూరి మల్లేశ్, మేరుగు చంద్రయ్య, బి ఆనంద్, యు నర్సన్న, వేల్పుల సాంబన్న, ఆరుమూళ్ళ తిరుపతి, సమ్మెట తిరుపతి, టి రాజకొమురయ్య, బి సాగర్, మొగిలన్న, అరుణోదయ నాయకులు బతుకుల రాజన్న, అబిద్నిగో, బాణేష్ తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: