మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఓపి కాంట్రాక్ట్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె  విజయవంతంగా కొనసాగింది. ఓబీ కాంట్రాక్టు కార్మికులంతా పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొని గోదావరిఖని ఫైవ్ ఇంక్లైన్ పార్క్ నుంచి చౌరస్తా వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు  అనంతరం గోదావరిఖని చౌరస్తాలో ఓబి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కౌశిక్ హరి, బుర్ర తిరుపతి, వేల్పుల కుమారస్వామి పూసాల తిరుపతి, ఏ వెంకన్న, తోకల రమేష్, మద్దెల శ్రీనివాస్ లు హాజరై మాట్లాడారు. ఒక ధర్నా వద్దకు సంఘీభావంగా తీన్మార్ మల్లన్న టీం అంబటి నరేష్, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ లేబర్ పార్టీ అధ్యక్షులు రమేష్, ఆల్ ఇండియా డ్రైవర్స్ యూనియన్ నాయకులు కె. సదయ్య పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వేతనాల కోసం సౌకర్యాల కోసం ఓబి కాంట్రాక్టు కార్మికులు తొలిరోజు నుంచి చేపట్టిన నిరవదిక సమ్మె పూర్తిస్థాయిలో విజయవంతం అయింది. ఓబి యాజమాన్యాలు మొండి వైఖరిని అనుసరిస్తూ సమ్మె ఉధృతికి కారణం అవుతున్నాయి. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా బెదిరింపులు వచ్చినా ఓబి కాంట్రాక్ట్ కార్మిక సమస్యలు పరిష్కరించేదాకా సమ్మెను ఆపేది లేదు. వేతనాలు పెంచేదాకా సమ్మె కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక శాంతికి విఘాతం కలిగించే విధంగా సింగరేణి అధికారులు రెచ్చగొట్టే చర్యలు చేయవద్దని సందర్భంగా తెలియజేశారు. కార్మిక చట్టాలకు లోబడి చేస్తున్న సమ్మెకు అన్ని వర్గాల కార్మికులు మద్దతు తెలుపాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా *ఈ కార్యక్రమంలో ఓబీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఎంఏ గౌస్, శనగల శ్రీనివాస్, అబ్దుల్ గని, మల్లేష్, చందు, భాస్కర్ లతోపాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: