మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం ఆధ్వర్యంలో , ముఖ్య అతిథులు తెలంగాణ లేబర్ పార్టీ అధ్యక్షులు గొర్రె రమేష్, న్యూ ఇండియా పార్టీ అధ్యక్షులు జె.వి. రాజు, సామాజిక కార్యకర్త ఏలేశ్వరం వెంకటేష్ ల సమక్షంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ వాల్ పోస్టర్ ను స్థానిక లక్ష్మినగర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గొర్రె రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సును ఈ ఆదివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని, దానిలో భాగంగా వారి డిమాండ్లను గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని వెంటనే ఏర్పాటు చేసి పదివేల కోట్ల బడ్జెట్ను కేటాయించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 20% తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలని, నామినేటెడ్ పదవులలో ఉద్యమకారులకు ప్రాధాన్యత కల్పించాలని, ఉద్యమకారులకి పెన్షన్ ఉచిత బస్సు ట్రైన్ పాసులను ఆరోగ్య కార్డ్ లను, 300 గజాల ఇంటి స్థలాన్ని, వడ్డీ లేని రుణాలను కేటాయించాలని, తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా గుర్తించి గౌరవించాలని, అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారులకు ప్రాధాన్యతనివ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యార్థి ఉద్యమకారులకి కోట కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నటుడు వేముల అశోక్ , నిరటి శంకర్ ,వేముల శ్రీనివాస్, య.డి. సర్వర్, లక్ష్మణ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: