రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు ఈరోజు రామగుండం నియోజకవర్గ ముఖ్య నాయకులతో బూత్ సశక్తీకరన్ మరియు భారత రాష్ట్రపతి ప్రసంగం గురించి వివరిస్తూ వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు. *బిజెపి రాష్ట్ర నాయకులు,మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ ఛైర్మెన్ సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఇంచార్జి రావుల రాంనాథ్,అసెంబ్లీ ఇంచార్జి, ప్రబారి ఆరుముళ్ల పోచం హాజరయ్యారు.ఈసందర్బంగా సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ బీజేపీ ని అధికారంలోకి తీసుకు రావలన్నదే ముఖ్య ఉద్దేశమన్నారు.అదేవిదంగా బూత్ స్థాయి కమిటీలు పూర్తిస్తాయిలో నిర్వహించి శక్తి కేంద్ర మీటింగ్ లు విడతల వారీగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కార్యకర్త హాజరయ్యేవిధంగా ప్రజలకు బీజేపీ భరోసా ఇస్తుందని ధైర్యాన్ని వారిలో నింపాలన్నారు.మోడీ నాయకత్వం లో రాష్ట్రం లో మనం పొందుతున్న సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రపంచంలో అపార మేధావి నరేంద్ర మోడీ అని ప్రపంచ దేశాలే స్పష్టం చేశాయన్నారు. నరేంద్ర మోడీ లాంటి నాయకున్ని ఇదివరకు ఎప్పుడూ మనం చూడలేదని రానున్న రోజుల్లో ఒక తిరుగులేని శక్తిగా రూపుదిద్దుకుంటున్నా నరేంద్ర మోడీని చూసి మనం గర్వపడాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర మహిళా మోర్ఛ కార్యవర్గ సభ్యురాలు శ్రీ సోమారపు లావణ్య అరుణ్ కుమార్ పార్లమెంట్ కన్వీనర్ మల్లికార్జున్, బీహెచ్ఈఎల్ డైరెక్టర్ బల్మూరి వనిత,బూత్ శక్తి కేంద్రం అసెంబ్లీ కన్వీనర్ బోడకుంట సుభాష్, యు.డి.సి.సి సభ్యులు కే. వెంకట రమణ, కార్పొరేటర్లు బి. లలిత, ఎం.కిషన్ రెడ్డి,అమరేందర్ రావు,మండల అధ్యక్షులు,శక్తి కేంద్రం అధ్యక్షులు,బూత్ స్థాయి నాయకులు,మహిళ మోర్చా సభ్యులు,నాయకులు, కర్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: