మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఈ విషయంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు జరపాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పకడ్బందీగా నిర్వహించే టీఎస్పీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ లీక్ అవ్వడం పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గతేడాది నిర్వహించిన గ్రూప్-1 పరీక్షా పత్రం సైతం లీక్ అయ్యిందని చెప్పారు. టీఎస్పీఎస్సీ సెక్రటరీ, ప్రవీణ్ కు ఈ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడంతోపాటు తానే స్వయంగా పరీక్ష రాసినట్లు సమాచారం ఉందన్నారు . అత్యధికంగా ప్రవీణ్ కు 103 మార్కులొచ్చాయని, అందుకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ గురించి ప్రస్తావించారు. ప్రవీణ్ కోసం పరీక్షా సమయాన్ని సైతం మార్చారని, అభ్యర్థులందరికీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పరీక్ష నిర్వహిస్తే... ప్రవీణ్ పరీక్ష రాసే కాలేజీకి మాత్రం మధ్యాహ్నం తరువాత నిర్వహించారని ఆరోపించారు. దీనిపై ఓ పత్రికలో వార్త వచ్చేంతవరకు టీఎస్పీఎస్సీ స్పందించలేదన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు జరపాలని కోరారు.

Post A Comment: