మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం:దుఃఖంలో కూడా సమాజ హితం కోసం కుటుంబ సభ్యుని నేత్రాలను దానం చేసి.. మరో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన రాజ్ ఠాకూర్ కుటుంబం ఆదర్శనీయమని సదాశయ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు టి. శ్రావణ్ కుమార్, సీహెచ్. లింగమూర్తి కొనియాడారు. ఈ నెల 3న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్  సింగ్ తమ్ముడు ఠాకూర్ శైలేందర్ సింగ్ (47) గుండె పోటుతో మృతి చెందాడు. మరో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించడాని, శైలేందర్ సింగ్ నేత్రాలను సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐ బ్యాంక్ కు దానం చేశారు. అయోధ్య సింగ్  నివాసంలో జరిగిన శైలేందర్ సింగ్ సంస్మరణ సభ కార్యక్రమంలో కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్, లింగమూర్తి మాట్లాడారు. నేత్రదానం మహదనమని అవగాహన కల్పించారు. 

అంధుల జీబితాల్లో వెలుగులు ప్రసాదించడానికి మరణానంతరం నేత్రదానం చేయడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

కుటుంబ సభ్యుడు ఠాకూర్ శైలేందర్ సింగ్  కోల్పోయిన దుఃఖంలో కూడా సమాజ హితం కోసం ఆయన నేత్రాలను చేయడానికి ముందుకు వచ్చిన నేత్రదాత  భార్య ఠాకూర్ సరోజ్, కూతుళ్ళు తనిషా, అనేక, సోదరులు, వదినలు ఠాకూర్ అయోధ్య సింగ్, హేమలత, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, మనాలి, ఠాకూర్ ధర్మేంధర్ సింగ్, ఉమ, సోదరీమణులు సునీత, విమలను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు మారెల్లి రాజిరెడ్డి, రఘుపతి, అన్నపూర్ణ, జ్యోతి, తిరుమల, బైరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: