ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిలో నైతిక విలువలు పెంపొందించేలా వారి భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యత ఉపాధ్యాయులదే అని విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన పేర్కొన్నారు. మంగళవారం నాడు కలెక్టరేట్‌లోని మీటింగ్ హల్ లో హాలులో మన ఊరు మన బడి పథకం విద్యాశాఖ డైరెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి, స్పెషల్ అధికారులు, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టిందని చెప్పారు. మన ఊరు మన బడి అనే బహత్తర కార్యక్రమం ద్వారా అన్నిరకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక విద్యాలయాలుగా తీర్చిదిద్దాలని విద్యాశాఖా అధికారులకు సూచించారు . కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ పాఠశాలల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రధానంగా ఉపాధ్యాయులపై ఉందన్నారు. పాఠశాలలను శుభ్రంగా ఉంచి విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించారని చెప్పారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించడంతోపాటూ విద్యార్థులు ఆచరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెనుక బడిన ఉన్న పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నామని చెప్పారు. ఈ పనులన్నిటినీ సకాలంలో పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలని విద్యాశాఖ అధికారులను ఆమె ఆదేశించారుప్రతి విద్యార్థి సక్రమంగా చదవడం, రాయడంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు. మన ఊరు మన బడి పనులను ఏప్రిల్ 15 వరకు పూర్తి చేయాలి అని ఆదేశించారు.పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం, కిచెన్ షెడ్ నిర్మాణం, డైనింగ్ హాల్, ఫ్లోరింగ్ పనులు, అప్పర్ ప్రైమరీ స్కూలు అదనపు తరగతుల ఫ్లోరింగ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిధుల కొరత లేదని స్పష్టం చేసారు. ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్ర మైనది అని, బాధ్యతయూతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు.ప్రత్యేక అధికారులు, విద్యా శాఖ అధికారులు సమన్వయము తో పని చేయాలి అని అన్నారు.
ఈ సమావేశం లో అడిషనల్ జిల్లా కలెక్టర్ సంధ్యారాణి, ఆర్జేడీ సత్యనారాయణ డిఈఓ అబ్దుల్ హై, సిపిఓ సత్య నారాయణ, డిపిఓ జగదీశ్వర్,ఎస్సీ కార్పొరేషన్ ఈడి మాధవి లత, స్పెషల్ అధికారులు , ఎంఈవో లు, ఏపీవో, ఇంజనీరింగ్ విభాగం ఏఈ, డీఈలు, స్కూల్ హెడ్మాస్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
అంతకు ముందు లస్కర్ బజార్ లో గల ప్రభుత్వ ప్రాక్టీసింగ్ పాఠశాల,గర్ల్స్ హై స్కూల్ లో మన ఊరు మన బడి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. ఉపాధ్యాయులను అభినందించారు.


Post A Comment: