మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా,రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలోని సర్వే నెంబర్ 261 లోని భూమిలో ఆక్రమణపై వివాదం చెలరేగింది.ఆ గ్రామానికి చెందిన పుట్ట రాజన్న తనకు చెందిన భూమిలో కొంత భాగంలో పుట్ట రమేష్,అతని బంధువులు ఆక్రమించుకున్నారని,ఈ విషయమై జిల్లా సర్వే విభాగంలో దరఖాస్తు చేయగా,పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు రామగిరి మండల సర్వేయర్ అనిల్ సోమవారం నాడు మోకా మీదకు వచ్చి హద్దులు నిర్ణయిస్తుండగా,పుట్ట రమేష్,అతని బంధువులు సర్వేకు సహకరించకుండా,బాధితున్ని బెదిరిస్తూ ఇంకింత భూమి ఆక్రమించుకుంటాము నీదిక్కున్న కాడ చెప్పుకో,ఊరు వదిలి వెళ్ళిపో,సర్వేయర్ హద్దులను ఒప్పుకోము అంటూ బెదిరించి వెళ్లిపోయారని బాధితుడు పుట్ట రాజన్న పాత్రికేయులకు వివరించినాడు,గత ఏడాది మాటుకట్ట భూమిలో పుట్ట రమేష్ జెసిబితో మట్టిని తవ్వించి ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలించాడని,కంప్లైంట్ ఇస్తాననడంతో గ్రామ పెద్దలు టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ,సుంకరి మహేందర్లను తీసుకొని వచ్చినాడు ఆ పెద్దల సమక్షంలో ప్రశ్నించగా,తవ్విన 40 ట్రాక్టర్ల మట్టిని రెండు రోజుల్లో తీసుకువచ్చి పోస్తామని పుట్ట రమేష్,గడ్డం సమ్మయ్య తన తప్పు ఒప్పుకున్నాడని ఆ మట్టి ఇంతవరకు పోయకుండా ఇంకా భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడని,ఈ విషయంలో రెవెన్యూ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని పుట్ట రాజన్న కోరాడు.

Post A Comment: