మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
న్యాయవాద పరిషత్ గోదావరిఖని ఆధ్వర్యంలో శారద నగర్ సరస్వతి శిశు మందిర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు మరపు లావణ్య అరుణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన భారత చరిత్ర నుండి నేటి ఆధునిక స్వతంత్ర భారతంలో సైతం అన్ని రంగాల్లో మహిళలకు రక్షణ కల్పిస్తూ వారి సంపూర్ణ అభివృద్ధికి చేయూత అందిస్తూ భారత సమాజంలో స్త్రీ స్థానానికి పదిలమైన గౌరవమైన ఆరాధన భావంతో కూడిన సుహృద్భావ వాతావరణం మన భారతదేశంలో మహిళా సాధికారతకు ఆస్కారం కల్పిస్తున్నాయి భారత స్వాతంత్ర నారీతరం రాజ్యాంగపరంగా మహిళలందరికి సమానత్వం, సాధికారత, గౌరవాన్ని పెంపొందించే విధంగా భద్రత కల్పించడం జరిగిందన్నారు అంతేకాక నేడు విదేశీ భావజాలంతో కూడిన సైద్ధాoతిక పోకడలు మితిమీరిన స్వేచ్ఛ స్వాతంత్రం అని ముసుగులో ఎన్నో అనర్ధాలకు దారితీస్తూ స్త్రీ భద్రతకు సాధికారతకు ముప్పు వాటిల్లుతుందని , విద్యుత్ ధర్మం నేటి నారీశక్తి భుజస్కందాలపై ఉందనేది ముమ్మాటికి ఇది ఎవరు కాదనలేని వాస్తవం అని కాబట్టి భరతనారీ సాధికారతకు మూలమైన ఆధునిక మహిళ మేలుకో భవిష్యత్ సిద్ధాంతపరమైన ముసుగులో కొట్టుమిట్టాడకుండా సనాతన ధర్మ చారిత్రక వాస్తవాలలోని స్త్రీ శక్తిని తెలుసుకుంటూ భారత మహిళ అబలకాదు సభల అంటూ నేటి ఆధునిక యుగానికి సంపూర్ణ సాధికారతతో కూడిన బాటను మలుచుకోవాలి అని తెలిపారు
ఈ కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ కొత్త కాపు సుధాకర్ రెడ్డి, మహిళా విభాగ కార్యదర్శి శ్రీమతి మహేశ్వరి, రాగిణి మరియు సీనియర్ న్యాయవాది బల్మూరి అమరేందర్ ,సంతన్ కుమార్ , సంజయ్ కుమార్ మరియు మహిళ విభాగ న్యాయ వాదులు భారతి, ప్రసన్న, అంజలి, శ్రీలత, సౌభాగ్య, అనురాధ, రజిత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు

Post A Comment: