ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మహేశ్వరి గార్డెన్స్ లో యెలగంటి సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాయిబ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కాకతీయ పరపతి సంఘం మొదటి వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ
నాయిబ్రహ్మణులు ఆత్మగౌరవంతో జీవించే విదంగా తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని వారందరు గొప్పగా ఏదగడమే మా ప్రభుత్వ లక్షమన్నారు. నాయిబ్రాహ్మణ నాయకులు వారి సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారని వాటన్నింటికి పరిష్కార మార్గం చూపుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
నాయీబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సహకరిస్తానని, నిరుపేదలైన వారికి గృహలక్ష్మీ పధకం ద్వారా 3లక్షల రూపాయలను అందిస్తామన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం నాయిబ్రాహ్మణులు పట్ల చిత్తశుద్దితో ఉందని అందుకే వారికి విద్యుత్తు కొంతమేర ఉచితంగా అందిస్తున్నామన్నారు.
కాళీ స్థలాలు ఉన్నవారికి గృహలక్ష్మీ పధకం, లేని అర్హులైన నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్స్ కేటాయిస్తామని, గుడిసె వాసులకు సాధ్యమైనంత మేర పట్టాలు అందించే ప్రయత్నం చేస్తామని,రుణాలు అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు.
ఓరుగల్లు తూర్పును ఎంతో మంది నాయకులు పాలించారు కానీ ప్రజల కనీస అవసరాలు తీర్చలేదని, నియోజవర్గాన్ని అభివృద్ధిలో వెనకబడేసి కార్మికులు దొరికే ఖార్కానగా మార్చారని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ప్రజలు ఇన్నెండ్లు గుంతల పడ్డ రోడ్లతో నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారని నేడు తాను ఎమ్మెల్యే అయ్యాక ప్రధాన దారులతో పాటు అంతర్గత సీసీ రోడ్లు పూర్తి చేసి అద్భుతంగా మార్చమన్నారు
తాను ఎమ్మెల్యే అయ్యాక 1100కోట్లతో హాస్పిటల్, 75 కోట్లతో బస్ స్టేషన్, కూరగాయల మార్కెట్,పండ్ల మార్కెట్, మాంసాహారం కోసం ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
5కోట్లతో మహిళా కార్మిక భవనం, అంతర్గత డ్రైనేజీ కాలువలు, జిల్లా కేంద్రం, తూర్పు నియోజకవర్గం కేంద్రంగా కలెక్టరేట్ తీసుకొచ్చిన ఘనత తనకే దక్కుతుందన్నారు.
పేద బిడ్డలు చదువుకోవడానికి 7 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.
మన బిడ్డలు గొప్పగా ఎదగడమే మన లక్షమని వారిని ఉన్నతంగా చదివించి ఉన్నత స్థాయిలో చూడడమే మనకు కావాలి కాబట్టి అందుకే తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు.
ఇన్నేండ్లు పాలించిన నాయకులు చేసిన అభివృద్ధి నేడు తాను చేసిన అభివృద్ధి పై చర్చకు ఎప్పుడైనా సిద్ధమని ఎమ్మెల్యే అన్నారు.
ఇన్నేళ్లు కనిపించని మొఖాలు ఎలక్షన్ రాగానే ఎందుకు కనిపిస్తున్నాయని ఇన్నేళ్లు ఎక్కడ పోయారని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ప్రజలు అంత గమనిస్తున్నారని వారికి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు తెలుసన్నారు.
నాయీబ్రాహ్మణ అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ గందే కల్పన నవీన్, వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయిబ్రాహ్మణ అధ్యక్షులు యెలగంటి సతీష్,61వ డివిజన్ అధ్యక్షులు రాములు,ఎడ్ల మురళి,శ్రీ రాముల సురేష్, కొత్తపల్లి శ్రీనివాస్,సాంబయ్య, రమేష్,సింగరపు రమేష్,కుమారస్వామి,సమ్మెట వేణు,దశరతం, నాగరాజు,మామిడాల బాలు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: