మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
CPI ML ప్రజాపంధా, IFTU అధ్వర్యంలో గోదావరిఖనిలోని డిగ్రీ కళాశాల పక్కనగల కామ్రేడ్ యూ.రాములు స్మారక స్తూపం వద్ద ఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడు అమరుడు కామ్రేడ్ యు రాములు 19వ వర్ధంతి సభ జరిగింది. ముందుగా జెండా ఆవిష్కరణ జరిగింది. *CPI ML ప్రజాపంధా జిల్లా కన్వీనర్ గుజ్జుల సత్యనారాయణ రెడ్డి జెండా ఆవిష్కరించగా జిల్లా నాయకులు జూపాక శ్రీనివాస్ తోకల రమేష్, గుమ్మడి వెంకన్న హాజరై మాట్లాడుతూ*భారతదేశంలో కార్మిక వర్గం పెను ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్నది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్న హక్కుల పై దాడి ప్రారంభమైంది. కార్పొరేట్ శక్తులకు కార్మిక చట్టాలను తాకట్టు పెట్టే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరించింది. ఈ క్రమంలో భారత దేశంలో బలమైన కార్మిక ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉన్నది. కార్మికుల ఉద్యమంలో అమరులైన అమరవీరుల ఆశయాలను భుజాన ఎత్తుకొని పోరాడాల్సిన అవసరం ఏర్పడింది.
కామ్రేడ్ యు రాములు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంఘటిత సంగటిత కార్మిక వర్గం కోసం చివరిదాకా పోరాడాడు. కామ్రేడ్ యు రాములు ఆశయాలను భుజాన పెట్టుకొని పోరాడడమే అతనికి మనమిచ్చే నివాళి.
కొన్ని శక్తులు అమరుల త్యాగాలను తమ స్వార్థానికి వాడుకుంటూ స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. ప్రభుత్వాలు అమలు త్యాగాలను అవమానపరిచే విధంగా కార్మిక హక్కులను హరిస్తున్నది. ఈ క్రమంలోనే అమరులు చూపించిన బాటలో, వారు అందించిన స్ఫూర్తితో బలమైన కార్మికుల నిర్మించి ప్రభుత్వాల దాడిని తిప్పగొట్టగలగాలి. ఆ క్రమంలో కార్మిక వర్గం అంతా కూడా కార్మిక వర్గ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఇంకా *ఈ కార్యక్రమంలో CPI ML ప్రజాపంధా జిల్లా నాయకులు*గుజ్జుల సత్యనారాయణరెడ్డి జూపాక శ్రీనివాస్ గుమ్మడి వెంకన్న, తోకల రమేష్, ఆడేపు శంకర్, పెండ్యాల రమేష్, గొల్లపల్లి చంద్రయ్య, కోడిపుంజుల లక్ష్మి, బి.కృష్ణ మార్త రాములు, మార్త రాద, తీగుట్ల రాములు మాట్ల సమ్మయ్య, బి.శివశంకర్,బి.ప్రసన్న, కొట్టే స్వరూప,కొట్టే తిరుపతి,తూళ్ళ చంద్రయ్య,బి. లక్ష్మణ్,ఎం రాజయ్య, తూళ్ల శంకర్,లింగయ్య,క్రాంతి తదితరులు పాల్గొన్నారు

Post A Comment: