ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా క్లినిక్ లో సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం పోచమ్మ కుంట పట్టణ ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య మహిళా క్లినిక్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి వైద్యాధికారిణి ఏ విధంగా మహిళలకు సేవలందిస్తున్నారని, ఏ ఏ పరీక్షలు చేస్తున్నారని వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో ఆరోగ్య మహిళా క్లినిక్లు పోచమ్మ కుంట, శాయంపేట పట్టణ ఆరోగ్య కేంద్రాలలో మరియు సిద్దాపూర్, ఆత్మకూర్, గోపాలపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతి మంగళవారము మహిళలకు సంబంధించిన 8 అంశాలలో సేవలందిస్తున్నారని, మహిళలకు బిపి, షుగర్,రక్త హీనత, క్యాన్సర్ స్క్రినింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని, ఈ యొక్క మహిళ ఆరోగ్య క్లినిక్ ల గురింఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాలు ప్రజలకు తెలియజేయాలన్నారు.
ఇట్టి కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. సాంబశివరావు, డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎండి.యాకుబ్ పాషా, పోచమ్మ కుంట పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ దీప్తి, జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, ఆఫ్తాల్మిక అధికారి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: