మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) పెద్దపెల్లి జిల్లా 8వ మహాసభలు NTPC జ్యోతి నగర్ లో మార్చి. 18,19.తేదీలలో జరగబోతున్న సందర్భంగా RG 1. డివిజన్ పరిధిలో బంగ్లాస్ ఏరియా తోటమాలి కాంట్రాక్టు కార్మికుల సెక్షన్ వద్ద మహాసభల యొక్క వాల్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా *IFTU జిల్లా నాయకులు ఎం దుర్గయ్య, SCCWU-(IFTU) రామగుండం రీజియన్ కార్యదర్శి కోండ్ర మొగిలి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం లాభాల్లో నడుస్తున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారధత్వం చేయడానికి వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలన్నారు. అలాగే IFTU జిల్లా 8వ.మహాసభల సందర్భంగా ఈనెల 18 NTPC నెంబర్ 2. గేటు నుండి TV గార్డెన్ వరకు జరిగే ర్యాలీ ని VT గార్డెన్ లో.జరిగె బహిరంగ సభలో అలాగే 19న జరిగే ప్రతినిధుల సభ లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికుల కు పిలుపునిచ్చారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో IFTU జిల్లా SCCWU (IFTU) నాయకు లు పోచన్న, సబిత, సమ్మక్క,లక్ష్మి, శైలజ సుదాకర్, శంకర్, మల్లేశం, శ్రీనివాస్ దితరులు పాల్గొన్నారు.

Post A Comment: