ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం శాయంపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి తో కలిసి ఆరోగ్య మహిళా క్లినిక్ ను ప్రారంభించారు. ఈ సందర్భం పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ మహిళల ఆరోగ్య సమస్యలపై ఆలోచించే ముఖ్యమంత్రి మరియు ఆరోగ్య శాఖామాత్యులు ఉండడం మన యొక్క అదృష్టమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాల అనుసరించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు మహిళల ఆరోగ్య రక్షణకై ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని ఇందులో
సమగ్ర ఆరోగ్య పరిరక్షణ కోసం మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆయన తెలిపారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో శాయంపేట మరియు పోచమ్మ కుంట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ యొక్క ఆరోగ్య మహిళా క్లినిక్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ రెండు ఆరోగ్య కేంద్రాలలో ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించడం జరుగుతుందని అవసరమైన వారికి మరిన్ని పరీక్షల కై గవర్నమెంట్ మెటర్నటీ హాస్పిటల్ కి రెఫర్ చేసి చికిత్స అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. త్వరలో ప్రారంభించబోయే తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా 57 రకాల పరీక్షలు ఉచితంగా అందించనున్నారని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని ఆరోగ్య మహిళ క్లినిక్లను ఏర్పాటు చేయడం మహిళల పాలిట వరమని ఈ అవకాశాన్ని అందరూ మహిళలు
ఉపయోగించుకోవాలని, కెసిఆర్ కిట్టు ను అందిస్తూ మాతా శిశు మరణాల రేటు తగ్గుటకు దోహదపడడా మే కాకుండా ఆసుపత్రి ప్రసవాలు పెరిగాయని అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు ఎంతో విలువైన టిఫా స్కాన్లను ప్రతి గవర్నమెంటు హాస్పిటల్లో ఉచితంగా అందిస్తున్నారని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ మామిళ్ల రాజు, జులైవాడ కార్పొరేటర్ మానస రాంప్రసాద్, అడిషనల్ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ మదన్మోహన్ రావు, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ మౌనిక, పట్టణ ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: