ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

                                                                            భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్లీనరీ సమావేశం భూపాల పల్లి జిల్లా కేంద్రములో శ్రామిక భవన్ లో  బుధవారం  సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరణతో ప్రారంభమైంది. ప్లీనరీ సమామవేశం వెలిశెట్టి రాజన్న పొలం రాజేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జే. వెంకటేష్  హాజరై మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారం లోకి  వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న రైతులు కార్మికులు అన్ని రంగాల ప్రజలపై దాడిని ప్రారంభించింది అదేవిధంగా ఒక దిక్కు ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని  సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామ నీ, పెద్దా నోట్లు రద్దు చేసి పేదలను బ్యాంక్ ల చుట్టూ తిప్పరు.  బిజెపి సర్కార్ ఇచ్చిన హామీల అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ప్రభుత్వ ఆస్తులన్నిటిని బడా పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పజెప్తా ఉంది మోడీ గారు టీ అమ్మరో  లేదో తెలియదు గాని ఈరోజు టి  కంటే తక్కువ ధరలతో ప్రభుత్వ ఆస్తులు అమ్మడం జరుగుతుందన్నారు ప్రజల నికర ఆదాయం రోజురోజుకు పడిపోయి ప్రజలు ఆకలి తో అలుమటి స్తుంటే   ఉంటే ఈ దేశంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విధానాల వల్ల అధని ఆస్తులు మాత్రం రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి అన్నారు.  అదేవిధంగా ప్రజలకు కావాల్సిన నిత్యవసరాలు వాస్తు ధరలు రోజు రోజు కు పెంచుకుంటూ పోతున్నారు ఈ మోడీ సర్కార్ చేసే ప్రజావ్యతిరేక విధానాలకు ప్రశ్నించే గొంతుకలను  నొక్కుతున్నారు అదేవిధంగా కులం పేరుతో మతం పేరుతో ప్రజల పట్ల అనైక్యతను సృష్టించి వీరి పరిపాలన పట్ల ప్రజలు ఆలోచించకుండా మతమనే మత్తులో ముంచుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ దేశంలో ఉన్న మోడీ సర్కార్ ప్రజల సంక్షేమ సర్కార్ కాదని ఇది బడా పెట్టుబడిదారుల సర్కారు అని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఈనెల 18వ తేదీన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జన చైతన్య యాత్ర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని వారు సూచించారు పార్టీ జిల్లా కార్యదర్శి బంద్ సాయిలు గారు మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పాత  ఎర్ర చెరువులో  గుడిసెలు వేసుకున్న పేద ప్రజలందరికీ జీవో నెంబర్ 58 ప్రకారం ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చి ప్రభుత్వం ఇల్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందించాలని, వారు అన్నారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ పోడుపులో పట్టాలు ఇచ్చే విధంగా 2005 అట హక్కుల  చట్టాన్ని అమలు చేయాలని , అసంఘటిత రంగం కార్మికులకు పీఎఫ్, ఈఎఫ్ఐ చట్టబద్ధత సౌకర్యం కల్పించాలని. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హెచ్పిసి వేతనాలు అమలు చేయాలని .సింగరేణి జనుకో ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి బొగ్గు శుద్ధి కర్మాగార పరిశ్రమ లను ఏర్పాటు చేస్తూ ఈ జిల్లా నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలి. ఉప్పల్ నుండి భూపాలపల్లి వరకు రైల్వే మార్గం ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ భవనాలకు పక్కా భవనాలు నిర్మించాలి. జిల్లాలో లేబర్ ఆఫీసు రిజిస్ట్రేషన్ ఆఫీసును ఏర్పాటు చేయాలి. జిల్లాలో బీఈడీ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయాలి. మేడిగడ్డ అన్నారం సింగరేణి జెన్కోల కింద భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలి. గడ్డిగానిపల్లి దుబ్బపల్లి కాపురం గ్రామాలకు ఆర్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇచ్చి పునర్నివాసం కల్పించాలి. వృద్ధాప్య వికలాంగుల వితంతు పెన్షన్లు మంజూరు చేయాలి. కనీస వేతనాల జీవో సవరించి ప్రతి ఒక్కరికి కనీస వేతనం 21000 ఇవ్వాలి ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి. ఆహార భద్రత చట్టాన్ని ప్రతిష్ట చేయాలి మహిళలకు బాలికలపై జరుగుతున్న అత్యాచారను అరికట్టాలి .ఇంటి పన్ను ఆర్టిసి విద్యుత్ ఛార్జీల పెంపు విరమించుకోవాలి. అని పలు తీర్మానాలను ప్రవేశపెడుతూ ఈ తీర్మాలను  ప్రభుత్వ అమలు చేసే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ప్రజల పక్షాన భవిష్యత్తు లో  ఉద్యమాలు నిర్వహిస్తామని వారన్నారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దామెర కిరణ్ చెన్నూరి రమేష్ జిల్లా కమిటీ సభ్యులు గుర్రం దేవేందర్ ప్రీతి పశువుల వినయ్ శ్రీకాంత్ సకినాల మల్లయ్య రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: