ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్ లోని ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిథిగా పాల్గొనగా, గౌరవ అతిథిగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్, శాసనమండలి ఉప సభాపతి డాక్టర్ బండ ప్రకాష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కుండు సుధారాణి, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచారి టి రమేష్, హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్, మహబూబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ బిందు, భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి, రాష్ట్ర సంగీత అకాడమీ చైర్మన్ దీప్తి రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమీషనర్ భారతి హోలీ కేరి హనుమకొండ జిల్ల కలెక్టర్ సిక్తా పట్నాయక్, కమిషనర్, ప్రవీణ్యా తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ
చారిత్రాత్మకమైన రుద్రమదేవి ఏలిన ఓరుగల్లు గడ్డ పై అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం వరంగల్ ప్రజలు అదృష్టమని, అంతర్జాతీయ మహిళల హక్కుల కోసం ఉద్యమించి ప్రపంచానికే చాటిచెప్పిన గొప్ప వీర వనితల దినోత్సవం“అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని” ఆమె అన్నారు. సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందుకు పోతున్నారని, దృఢ సంకల్పంతో రాజకీయాలలో, విద్య ఉద్యోగ రంగాలలో ముందుకు వస్తున్నారని, అయితే మహిళలు సమాజంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారని ఇంకా సమాజంలో మార్పులు రావాల్సిన అవసరం ఎంతమంది ఉందని, కుటుంబ పోషణతోపాటు సమాజ అభ్యున్నతికి పాటుపడాల్సిన మహిళలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2015 నుండి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగానే ఉత్తమమైన ప్రతిభ కలవరించిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్కరించుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆరోగ్య లక్ష్మి ప్రతి జిల్లాలో ఐదు సెంటర్లలో నిర్వహించడం జరుగుతుందని రాష్ట్రంలోని 33 జిల్లాలలో 1200 సెంటర్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.250 కోట్ల రూపాయల న్యూట్రిషన్ కిట్ అందించడం ఒక్కొక్క కిట్టులో 4000 విలువ గల ఆహారపు వస్తువులు ఉంటాయన్నారు, బాలామృతం పేరుతో పేదింటి మహిళలకు పౌష్టిక ఆహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె తెలిపారు. మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గిపోయాయని గతంలో 60 శాతం ఉంటే ప్రస్తుతం 27 శాతానికి తగ్గిపోయిందని, రాష్ట్రంలో 14 లక్షల మందికి కల్యాణ లక్ష్మి 12 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. చిన్నపిల్లలకు చేయకుండా పిల్లల చదువుల కోసం రాష్ట్రంలో అనేక ఆశ్రమ పాఠశాలలను కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాలుగు లక్షల మంది విద్యార్థులు ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్నారని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 33% రిజర్వేషన్ అమలు చేస్తుందని సమాజంలో సగం ఉన్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని ఇది దేశంలోనే ఒక గొప్ప ముందుచూపు వ్యవహారమని ఆమె అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్లో 20 కోట్లతో వచ్చే సంవత్సరం నాటికి రెండు పెద్ద భవనాలు నిర్మిస్తామని ఆమె తెలిపారు. ప్రీతి ఆత్మహత్య దురదృష్టకరమైన సంఘటనని , విద్యార్థులు ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలి కానీ అధైర్యంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి నిరంతరం పాటు పడుతుందని.2023 మహిళా దినోత్సవ కార్యక్రమంలో 27 మంది ప్రతిభ గల మహిళలను సత్కరిస్తున్నట్టు ఆమె తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళల, కోసం వృద్ధుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం రాష్ట్ర మహిళలందరికీ అండగా ఉంటుందని సత్యవతి రాథోడ్ వివరించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
మేయర్ గుండు సుధారాణి: తెలంగాణ రాష్ట్రంలో మహిళల సర్వతో ముక్క అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విద్య ఉద్యోగ, పారిశ్రామిక రంగాలలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన మహిళా సంక్షేమ పథకాలు దేశంలో ఇక్కడ లేని విధంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధాప్య పెన్షన్, ఒంటరి మహిళల పింఛన్, పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
విసి ఆచార్య టి రమేష్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1857లో జరిగిన ఉద్యమం వారు దార పోసినా రక్తార్పణ కారణంగా అంతర్జాతీయ మహిళా హక్కుల కోసం చేపట్టిన ఉద్యమం అని ఆయన అన్నారు. నేడు విద్యావ్యవస్థలో 65 శాతం మంది మహిళలు విద్య నభ్యసిస్తున్నారని ఇది మహిళల్లో వచ్చిన చైతన్యమని ఆయన అన్నారు.
జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్: కాకతీయ గడ్డపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం వరంగల్ ప్రజల అదృష్టమని అన్నారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం మహిళలను మహిళలు గౌరవించడం గొప్ప కార్యక్రమం అని, నేడు ప్రతి రంగంలో మహిళలు దూసుకుపోతున్నారని సమాజంలో ఇంకా అక్కడక్కడ మహిళలు సమస్యలను ఎదుర్కొంటున్నారని వీటిని నివారించుటకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందన్నారు.
దీప్తి రెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల గౌరవంగా వారిలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా తగు చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ డాక్టర్ వాసుదేవ రెడ్డి, గ్రేటర్ వరంగల్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తదితరులు ప్రసంగించారు. కమిషనర్ భారతి హోలీ కేరి తమ శాఖ తరపున అందిస్తున్న ప్రభుత్వ పధకాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్రాజు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన మహిళలు, కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు. సంస్కృతిక కార్యక్రమాలు విశేషం గా అలరించాయి.
27 మంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ సత్కారం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ కాకతీయ గడ్డపై కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ విభాగాలలో విశేష కృషి చేసిన నిష్టాతులైన 27 మంది మహిళలను రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాథోడ్ ఘనంగా సత్కరించారు. సత్కారంలో లక్ష రూపాయల నగదు ప్రశంసా పత్రం అందజేశారు.
Post A Comment: