ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ మరింత అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ప్రాంగణం లో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మహిళా దినోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ , నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు. సమాజ కట్టుబాట్ల వల్ల ఒకప్పుడు వంటింటికే పరిమితం అయిన మహిళలు ప్రస్తుతం అన్నీ రంగాలలో రానిస్తున్నారు అని అన్నారు. మహిళలు సమానత్వాన్ని సాధించాలంటే వారికి చదువు ఎంతో అవసరం అని అన్నారు. మహిళల అవగాహన కోసం ఎక్కువ కార్యక్రమలను చేపట్టాలని సూచించారు. ఐడిఓసి లో రాబోయే కొద్దిరోజులలలో మిగిలిన డిపార్ట్మెంట్ లు రానున్న యని అన్నారు. అందరు ఉద్యోగుల సహకారం తో జిల్లా ను అగ్రస్థానం లో నీలేపెందుకు కృషి చేయాలి అనీ అన్నారు.
అదనపు కలెక్టర్ సంధ్య రాణి మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల కోసం అన్నీ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కలెక్టరేట్ లో దాదాపు 200 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు అన్ని అన్నారు.మహిళా ఉద్యోగాల ప్రత్యేకంగా నిధులు సేకరించి వరద బాధితులకు సహాయం అందించమని గుర్తు చేసారు. కలెక్టరేట్ లో చిన్నారుల సంరక్షణ కు ప్రత్యేకంగా ఒక కేంద్రం ను ఏర్పాటు చేయడం జరిగింది అన్ని అన్నారు. యూనియన్ ల సహకారం తో బతుకమ్మ, దసరా వంటి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించమని అన్నారు.
ఐడిఓసి ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలలో పాల్గొనిన మహిళా ఉద్యోగ విజేతల వివరాలు మ్యూజికల్ చైర్స్ లో ప్రథమ ప్రథమ బహుమతి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి కి, ట్యాగ్ ఆఫ్ వార్ లో నీరజ డిఆర్ఏఓ మరియు గ్రూప్, డాన్స్ పోటీలు ప్రథమ బహుమతి ఆశా ఐ & పి ఆర్, ద్వితీయ బహుమతి నాగరాణి మెప్మా నుండి, మరియు ఇతర మహిళ ఉద్యోగులు బహుమతులు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చేతుల మీదుగా అందుకున్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్
సంధ్యారాణి, డిఆర్ఓ వాసుచంద్ర, పరకాల ఆర్డీఓ రాములు, డిఆర్డిఏ పిడి శ్రీనివాస్, టిజిఓ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రేసా అధ్యక్షుడు జి. రాజ్కుమార్, ఐడిఓసి మహిళ అసోసియేషన్ ప్రెసిడెంట్ నీరజ తదితర కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: