మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
వరంగల్: జిల్లా కేంద్రంలోని ss ఫంక్షన్ హాల్లో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను, ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిగా హాజరైన హైకోర్టు న్యాయవాది పోలేపాక చంద్రకళ హాజరై మాట్లాడుతూ, సమాజం లో రోజు రోజుకు బాలికల పై, మహిళ ల పై ఆగాయిత్యాలు, అత్యాచారలు పెరిగి పోతున్నాయన్నారు.మహిళ లు తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
అలాగే మహిళలు రాజకీయ, ఉద్యోగ, ఆర్థిక సామాజిక రంగాల్లో ముందుకు సాగాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో ప్రజా సంక్షేమ వేదిక నాయకులు జన్ను జయ, సింగారపు అరుణ, ప్రజా సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు మడికొండ రఘుపతి, నాయకులు కళ్లేపల్లి ఇందిర, కిరణ్ కుమార్, స్వరూప, గోడలా ఎల్జబెత్, ఎర్ర భాగ్య, ఉమా పాల్గొన్నారు.
Post A Comment: