ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఆధునిక రోగాల నివారణలో సిరి ధాన్యాలు ఎంతో కీలకపాత్ర వహిస్తున్నాయని, ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత దిశగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పోషణ పక్షం సందర్భంగా గురు వారం రోజున మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమన్వయ సమావేశం జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత అధ్యక్షతన జరిగిన
కార్యక్రమానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ
సంపూర్ణ పౌష్టికాహార ఆరోగ్య రక్షణ ఇవ్వగల సామర్థ్యం సిరిధాన్యాలకు ఉన్నదని, ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా కొద్దిపాటి వర్షాలకు పండే పంటలనీ, వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయని వీటిని పండించడానికి ఆర్థిక వనరుల ఖర్చు కూడా చాలా తక్కువనీ,
సిరిధాన్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలకు పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు ఇంటర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఈ అవగాహన కల్పించాలని క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పని చేయాలని అన్నారు.
సిరి ధాన్యాలు ప్రధానంగా కొర్రలు, అరికలు, సామలు, ఊదలు, రాగులు, సజ్జలు, వరిగులు, జొన్నలు మొదలైనవనీ వీటి వీటి ద్వారా ఆధునిక కాలంలో వచ్చే రోగాలను దూరం చేసుకోవచ్చని, ఈ సిరిధాన్యాల వినియోగం గురించి విస్తృత అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఈ సిరిధాన్యాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి అధికారి ఏ శ్రీనివాస కుమార్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు, పౌరసరఫరాల అధికారి వసంత రాణి, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి నిర్మల,
జిల్లా ఆయుష్ శాఖ అధికారి రామారావు, జిల్లా వ్యావసాయ అధికారి, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ రాధాదేవి, సిడిపిఓలు ఎం భాగ్యలక్ష్మి,
పి స్వరూప, జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ సుమలత, మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టులకు చెందిన సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: