ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
తెలంగాణ రాష్ట్ర మహిళ సహకార అభివృద్ధి సంస్థ- మడికొండ గురువారం మహిళ శిశు వికాస కేంద్రం -మడికొండ లో తెలంగాణ రాష్ట్ర మహిళ సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన
పి.జయశ్రీ జిల్లా అధికారిని ఆధ్వర్యంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ కౌశల్ యోజన పథకం- సెక్యూరిటీ సూపర్వైజర్స్ (DDU -GKY) జాబ్ అపాయింట్మెంట్ లెటర్స్ పంపిణీ మరియు మల్టీ పర్పస్ హెల్త్ వర్క్స్ (నర్సింగ్ శిక్షణ) శిక్షణ ప్రారంభోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ కౌశల్ యోజన పథకం లో భాగంగా సెక్యూరిటీ సూపర్వైజర్స్ (మూడు నెలల కోర్స్) శిక్షణ ను ముగించిన (21 మంది) అభ్యర్థులకు ఉద్యోగ అపాయింట్మెంట్ లెటర్స్ ను జిల్లా కలెక్టర్ అందించారు.
మరియు మల్టీ పర్పస్ హెల్త్ వర్క్స్ (నర్సింగ్ శిక్షణ ) (రెండు సంవత్సరంల కోర్స్) ఆరవ బ్యాచ్ (25 మంది) ను జిల్లా కలెక్టర్ చే జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించనైనది. మరియు శిక్షణ అభ్యర్థులకు యూనిఫామ్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేయనైనది. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీరు పొందిన జాబ్ తో ఇక్కడే ఆగిపోకుండా ఇంకా అభివృద్ధిపథంలో ఎన్నో సాధించి ముందుకు సాగాలని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సరోజన,పిడి డి ఆర్.డి.ఏ శ్రీనివాస్, ప్రాంగణం సిబ్బంది, ఎంఐహెచ్ డబ్ల్యూ (మహిళ) విద్యార్థులు, డిడియు-జికేవై విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.


Post A Comment: