ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

మనఊరు-మన బడి పనులు నాణ్యతతో వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మన ఊరు-మన బడి పథకం కింద కేటాయించిన స్పెషల్ అధికారులు , ఎంఈవో, ఎంపీడీవో, ఏపీవో, ఇంజనీరింగ్‌ విభాగం ఏఈ, డీఈల తో ,సమీక్షా సమావేశం నిర్వహించారు.

     ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మన ఊరు - మన బడి మరియు ఈజీఎస్‌ కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, కిచెన్‌ షెడ్‌ నిర్మాణం పూర్తి చేశాకే మిగతా ప్రహరీ, అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఎంపీడీవో, ఎంపీవోలు రోజువారీగా పాఠశాలల్లో జరుగుతున్న ఈజీఎస్‌ పనులను పర్యవేక్షించాలన్నారు. మరోవిడత సమావేశంలోపు ఇచ్చిన దాదాపు పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చేందుకు ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలో విడుతల వారిగా అప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. చిన్నచిన్న అడ్డంకులు ఎదురైనా అధికారులు సమన్వయంతో పరిష్కరించుకోవాలన్నారు. 

మండలాల వారిగా ఇట్టి పనులపై చర్చించగా, ముఖ్యంగా వేలేరు, నడికుడ,హాసన్ పర్తి, కమలపూర్, భీమదేవరపల్లి మండలాలలో ఈజీఎస్ వర్క్స్ ఎంఓఎంబి పనులు ఆలస్యంగా/వెనకబడి, తక్కువ స్థాయిలో రిపోర్ట్ వున్నందున అసహనం వ్యక్తం చేసారు. సంబంధిత ఏఈ,ఈఈ, డిఈ, స్పెషల్ ఆఫీసర్స్ ఎంపిడిఓ లు బాధ్యతయితంగా పని చేయాలి అని ఆదేశించారు. వచ్చే శుక్రవారం లోగా పూర్తి స్థాయిలో పనులను పూర్తి చేయలని ఆదేశించారు. ఈ పధకం కింద ఖర్చు చేసిన వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలి అని ఆదేశించారు. జిల్లాలో వేలేరు 2, ధర్మసాగర్ 2, హసన్ పర్తి 2, కాజీపేట 3, పరకాల 1, హనుమకొండ 3, మొత్తం 13 స్కూల్స్ పెయింటింగ్ తో సహా పనులన్నీ పూర్తి అయి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న స్కూల్స్ నీ సంబంధిత ఎమ్మెల్యే ల తో ప్రారంభించాలని అన్నారు.మరియు కొన్ని మండలాల్లో ఎంఓఎంబి పనులపై టెండర్స్ పూర్తికాని మండలాల్లో సంబంధిత సర్పంచులతో సమన్వయం చేసుకొని పనులు ప్రారంభమ్ అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి, డిఈఓ అబ్దుల్ హై, డిఆర్డిఏ పీడి శ్రీనివాస్, సిపిఓ సత్య నారాయణ, డిపిఓ జగదీశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి మాధవి లత, స్పెషల్ అధికారులు , ఎంఈవో, ఎంపీడీవో, ఏపీవో, ఇంజనీరింగ్‌ విభాగం ఏఈ, డీఈలు,స్కూల్ హెడ్మాస్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: