ఉమ్మడివరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
దృష్టి లోపాలను దూరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు . టీచర్స్ కాలనీ తో పాటు సోమిడి లో కొనసాగుతున్న కేంద్రాలలో కంటి శిబిరాల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, వారి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. శిబిరాల వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. రోజుకు సగటున ఎంత మంది నేత్ర పరీక్షల కోసం వస్తున్నారు, ఎక్కువగా ఏ వయస్సు వారు ఉంటున్నారని కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిబిరాలకు వచ్చే వారికి మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. క్యాటరాక్ట్ సర్జరీ అవసరం ఉన్న వారి వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో పొందుపర్చాలని సూచించారు.

Post A Comment: