ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ లోని అంబేద్కర్ భవన్లో జరిగిన ఆటో కార్మికులు మరియు ఉన్నతాధికారులతో ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ ఆటో కార్మికులు సమైక్య రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులందరూ ఆటో కార్మికులకు తోడ్పాటు గా ఉండాలని చేయూతను ఇవ్వడం జరిగింది అన్నారు. గురువారం మూడు గంటలపాటు నిర్వహించిన అవగాహన సదస్సు లో పోలీస్, ట్రాఫిక్ , ఆర్టీసీ, ఆర్టిఏ, లేబర్, సహకార రంగం నుండి పాల్గొన్న ఉన్నతాధికారులను మా ఆటో కార్మికులతో సమన్వయంగా ఉండాలి అని తెలియజేశారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల సమస్యలను మరియు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతోపాటు అధికారులకు ఉన్న సమస్యలను పరస్పర అవగాహనను కల్పించడం జరిగింది అని అన్నారు. ఏప్రిల్ మాసంలో ప్రవేట్ ఫైనాన్సర్ల నుండి ఆటో కార్మికులకు విముక్తి కోసం డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు సహకారంతో 100 ఆటో కార్మికులకు లోన్లను ఇప్పిచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు మరియు గృహలక్ష్మి పథకంలో కొంత శాతం మా ఆటో కార్మికులకు ఇచ్చి వారినీ ఆర్థికంగా ముందుకు తీసుకపోవడానికి నా తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు , పోలీస్ కమిషనర్ ఏ వి రంగనాథ్ , హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ , వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య , అడిషనల్ డీసీపీ కె పుష్ప , హనుమకొండ జిల్లా డిటిసి పురుషోత్తం, వరంగల్ జిల్లా ఆర్టీవో అఫ్రీన్ సిద్ధిఖీ , వరంగల్ జిల్లా ఆర్ఎం టిఎస్ఆర్టిసి శ్రీలత, లేబర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కొల ప్రసాద్, హనుమకొండ ఆర్డిఓ వాసు చంద్ర, ట్రాఫిక్ ఏసిపి మధుసూదన్ , కల్పలత సూపర్ బజార్ చైర్మన్ వర్ధమాన్ జనార్ధన్ , కల్పలత సూపర్ బజార్ ఎం.డి జగన్మోహన్ రావు, స్థానిక కార్పొరేటర్ నల్ల స్వరూప రాణి, త్రీచక్ర పొదుపు సంఘం అడ్వైజర్ రవీందర్ రెడ్డి , ఆటో యూనియన్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: