మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నగర పాలక సంస్థలో నిధులు పుష్కలంగా ఉన్నా అభివృద్ధి పనులు మాత్రం జరగడం లేదని ఏఐటీయూసీ రామగుండం నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ. గౌస్ ఒక ప్రకటనలో ఆరోపించారు. పట్టణంలోని గాంధీచౌరస్తా నుండి 5 ఇంక్లైన్ చౌరస్తా వరకు రోడ్డు అభివృద్ధి పనుల కోసం ఆరు కోట్ల రూపాయలు సింగరేణి యాజమాన్యం నిధులు కేటాయించి టెండర్లు పిలిచి స్థానిక ఎమ్మెల్యే చే శంకుస్థాపన చేసినప్పటికీ ని అభివృద్ధి పనులు మాత్రం జరగడం లేదని ఆయన విమర్శించారు.దీంతో ఆ రోడ్డు వెంబడి నడిచే ప్రజలకు ప్రయాణికులకు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారని, గుంతలు గుంతలు గా రోడ్లు కంకర తేలాయని ఆయన పేర్కొన్నారు. రోడ్లు, కాలువలు లేక ఆయా డివిజన్ లో ఉన్న ప్రజలు రోడ్డు వెంబడి ప్రయాణించే ప్రయాణికులు, డ్యూటీకి వెళ్లే కార్మికులు అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిధులు కేటాయించినా
మెయిన్ రోడ్లు, కాలువలు నిర్మాణం కోసం 6 కోట్ల రూపాయలు వరకు అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి చేసి శంకుస్థాపన చేసినా పనులు మాత్రం ప్రారంభించలేదని ఆయన ఆరోపించారు. శంకుస్థాపన చేసి నప్పటి నుంచి నేటి వరకు గాంధీ చౌరస్తా నుండి 5 ఇంక్లయిన్ చౌరస్తా వరకు అభివృద్ధి పనులు ముందుకు సాగలేదని ఆయన అన్నారు.
చెరువులను తలపిస్తున్న రోడ్లు
వర్షం కురిస్తే రోడ్ల ల పక్కన, ఖాళీ స్థలాలు చెరువులను తలపిస్తున్నాయని ఆయన అన్నారు. రోడ్లు ప్రక్కన కాలువలు సక్రమంగా లేకపోవడంతో వరదనీరు నివాస ప్రాంతాలు, రోడ్లపైనే నిల్వ ఉండిపోతుందని ఆయన అన్నారు. దీంతో ప్రజలు నరకయాతన పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు.
మున్సిపాలిటీకి అధిక మొత్తంలో ఆదాయం వచ్చినా,
గాంధీ చౌరస్తా నుండి 5 ఇంక్లైన్ చౌరస్తా వరకు అధిక మొత్తంలో ఆదాయం వస్తున్న అభివృద్ధి పనులు మాత్రం జరగడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వెడల్పు మరమ్మతులు చేపట్టాలని లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధం చేస్తామని ఆయన అన్నారు.

Post A Comment: