ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హొలీ పర్వదిన వేడుకలు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబమని , ప్రజల ఐక్యతను చాటి చెప్పే చిహ్నం గా విరాజిల్లుతున్నదని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఆవరణలో వరంగల్ కలెక్టర్ గోపి తో కలసి హొలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో టీజీవో,టీ ఎన్జీవోల, ఉపాధ్యాయుల, సీనియర్ సిటిజెన్స్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అధికారులతో కలిసి కలెక్టర్ హొలీ రంగులు చల్లడం అందరినీ అలరించింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడాలని, చెరువులు నీటి కొలనుల్లో స్నానాలు చేసేటప్పుడు అతి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులకు,ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పీడి శ్రీనివాస్ కుమార్,టీజీవో అధ్యక్షులు జగన్ మోహన్ రావు,మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: