ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో 8 మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం వేడుకలు నిర్వహిస్తున్నట్లు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ)
బి ఝాన్సీ లక్ష్మీబాయి, హనుమకొండ, వరంగల్ జిల్లాల సంక్షేమ అధికారులు ఎం సబిత, ఎం శారదలు తెలిపారు.
రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి మరియు కమిషనర్
భారతి హోలి కేరి ఆదేశానుసారం రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని చారిత్రక ప్రాంతంలో నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన మరియు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, గౌరవ అతిథిగా రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రత్యేక అతిధిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఉమ్మడి వరంగల్ జిల్లా పార్లమెంట్, శాసనమండలి,
శాసనసభ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు
మరియు ప్రజా ప్రతినిధులు, మరియు హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ , ప్రభుత్వ సలహాదారు,
భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, తదితరులు
హాజరవుతున్నారని,
ఈ సందర్భంగా మహిళా సాధికారత కోసం సేవలు అందించిన
27 మంది మహిళలకు విశిష్ఠ మహిళా పురస్కారం కింద లక్ష రూపాయలతోపాటు ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందచేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,
ఉదయం గం 10:30 లకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి సంబంధిత శాఖ, వివిధ శాఖల అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Post A Comment: