మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పట్టణంలోని జెన్ కో గ్రౌండ్ లో క్రికెట్ టోర్నమెంటు ప్రారంభించిన బిజెపి సీనియర్ నాయకురాలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న యువకులను అభినందిస్తున్నానని క్రీడలు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయో వాటితో పాటు మన శరీరాన్ని , ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి అని ఈ వేసవి కాలంలో ఇంకా ఎన్నో క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తామని ఆమె తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపు పొందిన విజేత జట్టు కు 40 వేల రూపాయలు మొదటి బహుమతిగా , రన్నర్ అప్ గా నిలిచిన జట్టుకు 20వేల రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని క్రీడాభిమానులందరూ తప్పకుండా క్రికెట్ టోర్నమెంట్ ను వీక్షించి క్రీడాకారులను ప్రోత్సహించాలని అన్నారు.
Post A Comment: