మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఓబి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ జీ 2 జీఎం కార్యాలయం ముందు కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం ఆర్జీ 2 డీజీఎం పర్సనల్ ఏం మనోహర్ కు కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఓబి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి నాయకులు బుర్ర తిరుపతి ఎంఏ గౌస్, పూసాల తిరుపతి, ఏ వెంకన్న, బి అశోక్, మద్దెల శ్రీనివాస్, శనగల శ్రీనివాస్ లు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఓబి యాజమాన్యాలను ప్రోత్సహిస్తూ శ్రమ దోపిడీని చేయిస్తున్నది. హైపర్ కమిటీ వేతనాలు ఇప్పించాల్సిన సింగరేణి యాజమాన్యం ఓబి యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నదిఅని. సింగరేణి యాజమాన్యం అండతోనే ఓబి యాజమాన్యాలు చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి అని. తక్షణమే సింగరేణి యాజమాన్యం జోక్యం చేసుకొని ఓబి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచే విధంగా తగు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు*ఈ కార్యక్రమంలో ఓబి కాంట్రాక్ట్ కార్మికులు మరియుఓబీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పాల్గొన్నారు
Post A Comment: