మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం రీజియన్ లోని సింగరేణి సంస్థ పరిధిలోని ఓబి కాంట్రాక్ట్ కార్మికులు తమ వేతనాలు హక్కుల సాధనకై జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మార్చి 6 నుంచి తలపెట్టిన సమ్మెకు CPI ML ప్రజాపంధా పెద్దపెల్లి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని అన్నారు
ఓబీ కాంట్రాక్ట్ కార్మికులు చాలీచాలని వేతనాలతో తమ కుటుంబాలను అనేక ఇబ్బందులతో గడుపుతున్న పరిస్థితి ఉన్నది. కోల్ ఇండియా వేతనాలు రాక, హైపర్ కమిటీ వేతనాలు అమలు కాక, ఒకటవ కేటగిరి వేతనం ఇవ్వక ఓబి యాజమాన్యాలు శ్రమదోపిడికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓబి కాంట్రాక్టు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ ఓబి యాజమాన్యాలు స్పందించకుండా సింగరేణి యాజమాన్యం అండదండలతో, ప్రభుత్వ కను సైగల్లో ఇష్టం వచ్చిన రీతిలో మెదులుతున్నాయి.
మార్చి 6 తారీకు నుంచి జరగబోయే సమ్మె సింగరేణి యాజమాన్యాలకు, ఓబి యాజమాన్యాలకు, వారికి అండగా ఉంటున్న ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా నిలవాలి. తమ హక్కుల కోసం వేతనాల కోసం జరగబోయే సమ్మెను ఐక్యంగా కొనసాగించాలని మీ సమ్మె పోరాటానికి CPI ML ప్రజాపంధా సంపూర్ణ మద్దతును ఇస్తున్నదని, ప్రత్యక్ష పోరాటాల్లో సైతం పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేశారు
Post A Comment: