ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఇటీవల మృతి చెందిన ఉర్దూ రిపోర్టర్ యూసుఫ్ షరీఫ్ కుటుంబానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉర్దూ రిపోర్టర్ అయిన గత 20 సంవత్సరాలు నుండి రిపోర్టర్ గా సేవలందిస్తున్న యూసుఫ్ షరీఫ్ మరణించడం చాలా బాధాకరమని ఆయన కుటుంబానికి మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఇంకా డబల్ బెడ్ రూమ్ లో ఆయనకు కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సురేష్ టియుడబ్ల్యుజె (ఐజేయు) ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ ఆడెపు సాగర్, జనరల్ సెక్రెటరీ దుర్గాప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సాజిద్, కార్యవర్గ సభ్యులు ఎండి ఆమేర్, ఎండి అక్రమ్, సయ్యద్ సాదిక్ హుస్సేన్, మీర్జా రియాజ్, ఎండి బషీర్, అమీర్ నాజ్,ఎండి అమీర్, నీలం శివ,ఎండి బాబర్, అడేపు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: