ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
గత మూడు రోజులుగా చారిత్రాత్మకమైన హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రామచంద్ర మిషన్, కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో యోగ, ధ్యానం శిక్షణ కార్యక్రమాలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వినయ భాస్కర్ మాట్లాడుతూ యోగ శిక్షణ కార్యక్రమాలను మూడు రోజులపాటు వరంగల్ లో నిర్వహించడం ఈ వరంగల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడిందని, యోగా నిర్వహించడం వల్ల శారీరక రుగ్మతలు నశిస్తాయని, నేడు ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని యోగ నిర్వహించడంలో ప్రతి కుటుంబం సంతోషాలతో ఉంటుందని ఆయన అన్నారు. మారిన కాల పరిస్థితుల దృష్ట్యా శరీరానికి శ్రమ లేకపోవడం వల్ల చాలా అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుందని, కాబట్టి యోగ ఎవరింట్లో వాళ్లు రోజుకు ఒక గంట సేపు నిర్వహించడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకున్నట్లు అవుతుందని, ఇటువంటి కార్యక్రమాలు మన దగ్గర నిర్వహించడం మనకు ఎంతో అదృష్టమని ఆయన అన్నారు. యువతీ యువకులు విద్యార్థులు యోగా పట్ల ఆసక్తిని పెంచుకోవాలని యోగ ధ్యానం మానవ శరీరంలోని రుగ్మతులను పారదోలడానికి ఉపయోగపడుతుందని నేను కూడా యోగాను నిత్యం అనుసరిస్తానని దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. వరంగల్లో 200 ఎకరాలలో యోగా శిక్షణ ట్రస్ట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే యోగా గురువు దాజి స్థల పరిశీలన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వరంగల్ ప్రజలకు అందజేసిన యోగా శిక్షణ గురువులకు వినయ్ భాస్కర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పి డి శ్రీనివాస్ కుమార్, రామచంద్ర మిషన్. యోగ నిర్వాహకులు విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
Post A Comment: