మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
CPI ML ప్రజాపంధా, IFTU ఆధ్వర్యంలో రామగుండం బి థర్మల్ పవర్ స్టేషన్ ముందు నిరసన కార్యక్రమం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో CPI ML ప్రజాపంధా జిల్లా కన్వీనర్ గుజ్జుల సత్యనారాయణరెడ్డి, జిల్లా నాయకులు జూపాక శ్రీనివాస్, IFTU రాష్ట్ర నాయకులు తోకల రమేష్ హాజరై మాట్లాడుతూ...
రామగుండం బి-థర్మల్ కొనసాగింపుపై గందరగోళ పరిస్థితి నెలకొంది. 62.5 మెగావాట్ల బి-థర్మల్ కేంద్రాన్ని 1972 జూన్ 16న ప్రారంభించారు. అనంతరం ఈ పరిశ్రమ విద్యుత్తు ఉత్పత్తిలో దేశంలోనే పలు రికార్డులు సాధించింది. బొగ్గు, నీరు, భూమి, రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉండటం కలిసివ చ్చింది. 'పిట్ హెడ్ స్టేషన్'గా ఉన్నా, పక్కనే ఎన్టీ పీసీ ప్లాంట్లు విస్తరిస్తున్నా నాటి ఎ.పి.ఎస్.ఇ.బి.కె. ఇప్పటి జెన్కో యాజమాన్యాలు బి-థర్మల్ విస్త రణపై పూర్తి నిర్లక్ష్యం వహించాయి. ప్రస్తుతం ఈ ప్లాంటును మూసివేయాలనే ఆలోచనతో నిధులు, బొగ్గు, ఇంధనం నిలిపివేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్లాంటును విస్తరిస్తారని స్థానికులు, కార్మికులు, ఉద్యోగులు ఆశ పడ్డారు. దేశంలో పురాతన చిన్న విద్యుత్తు ప్లాంట్లను మూసి వేయాలన్న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) ఆదేశాలతో నాలుగేళ్ల కిందట రాష్ట్రంలోని కేటీపీఎస్. యూనిట్లను మూసివేశారు. బీదర్మల్ను కూడా మూసివేయాలని భావించారు. అయితే అప్పటికే పునర్నిర్మాణం (ఆర్ఆండ్రం), ఈఎస్పీ పనులు పూర్తి చేసి కాలుష్యాన్ని తగ్గించడం, విస్తరణ చేపట్టకపోవ డంతో మూసివేయకుండా 5 ఏళ్లు పొడిగించాలని కార్మిక సంఘాలు దిల్లీకి వెళ్లి సీఈఏ చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. దీంతో అయిదేళ్లు నడిపేందుకు వారు అనుమతి ఇచ్చారు. అయితే జెన్కో యాజమాన్యం మాత్రం వార్షిక మరమ్మతులకు నిధులు, అనుమతి ఇవ్వడం లేదు. చివరిసారిగా 2014లో వార్షిక మరమ్మతులు జరగగా, ఆ తర్వాత కార్మికులు, ఇంజినీర్లు ప్లాంటును రక్షించుకుంటున్నారు.
రానున్న రోజుల్లో దేశంలో విద్యుత్తు కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున చిన్న ప్లాంట్లను మూసివేయవద్దని, మరమ్మతులు చేపట్టి కొనసాగించాలని, అవసరమైతే వాటి స్థానంలో కొత్త ప్లాంట్లను నెలకొల్పాలని సూచించింది. రామగుం డంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది.
ఈ ఏడాది జనవరి 26 నుంచి బి-ధర్మల్కు బొగ్గు, ఇంధనం సరఫరా నిలిపివేశారు. ఉన్న నిల్వలతో ఉత్పత్తి చేపట్టాలని చెప్పడంతో అధికారులు, కార్మి కుల్లో ఆందోళన మొదలైంది. బొగ్గు, ఇంధనం సరఫరా పునరుద్ధరించి, వార్షిక మరమ్మతు లకు రూ. 15 కోట్లు మంజూరు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం
ఇంకా ఈ కార్యక్రమంలో CPI ML ప్రజాపంధా జిల్లా కన్వీనర్ గుజ్జుల సత్యనారాయణరెడ్డి, జిల్లా నాయకులు జూపాక శ్రీనివాస్, IFTU రాష్ట్ర నాయకుల తోకల రమేష్ గుమ్మడి వెంకన్న, పెండ్యాల రమేష్, ఆడెపు శంకర్, తీగుట్ల రాములు, కట్ట తేజేశ్వర్, తీగుట్ల దేవేందర్ మెతుకు వెంకటేశం లతోపాటు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: