ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై సీపీ రంగనాథ్ కొరఢా ఝళిపించారు. ఇప్పటికే అవినీతి, ఇతర ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేసిన సీపీ ఇప్పుడు ఒకేసారి ఎనిమిది మంది కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. అయితే ఈసారి సస్పెన్షన్ కాకుండా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వరంగల్ కమిషనరేట్ నుంచి మహబూబాబాద్ జిల్లా ఎస్పీకి అటాచ్ చేశారు. వీరంతా విధుల్లో అలసత్వం వహించడమేగాక, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే కారణంతో సీపీ చర్యలు తీసుకున్నారు. ఒకేసారి ఎనిమిది మందిపై చర్యలు తీసుకోవడం కమిషనరేట్ పరిధిలో చర్చనీయంగా మారింది.
వీరిపైనే చర్యలు
ఆర్. ఉమేష్ (వరంగల్ ట్రాఫిక్)
షఫీ (మిల్స్ కాలనీ)
బి.వీరస్వామి (ధర్మసాగర్)
టి.శ్రీనివాస్ (మామునూర్)
ఎం.డి ఖలీముద్ధీన్ (నర్సంపేట్)
కె. వీరస్వామి (నర్సంపేట)
వి.రాజు (సుబేదారి)
టి. మధుకర్ (కాజీపేట)
Post A Comment: