మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
8వ కాలనీ లో నివసించే కాసర్ల మధు 10-3-23 న హటాన్మరణం చెందగా నేత్ర దానం చేయడం జరిగింది. నేత్ర దాత సంస్మరణ సభ ను ఈ రోజు వారి స్వగృహం లో సదాశయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ch లింగమూర్తి, నర్సింహా చారీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వచ్చిన బంధు మిత్రులకు నేత్ర అవయవ దానాలా పై అవగాహనా కల్పించారు. మరణించిన తరువాత ప్రతి ఒక్కరు నేత్ర దానం చేయాలనీ, నేత్ర దానం వలన ఇద్దరు అంధుల్లో చూపు తీసుకొని రావొచ్చని, కోట్లు పెట్టిన మార్కెట్ లో దొరకని నెత్రాలను మట్టిలో కల్పకూడదని, నేత్ర దానం చేయాలను కుంటే 9492781306 సంప్రదించాలని తెలిపి.ఇద్దరికి చూపు ను ప్రసాదించిన కూతుర్లు సత్యప్రియ, సత్య దీపిక లను ముఖ్య అతిధిగా విచ్చేసిన ఐలి శ్రీనివాస్ tbgks వైస్ ప్రెసిడెంట్ కుటుంబ సభ్యుల మంచి హృదయం ను కొనియాడి అభినంధించి *అభినందన పత్రం అందించారు.లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షులు రాజేందర్ సదాశయ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, సలహాదారు నూక రమేష్, 2టౌన్ si శ్యామ్ పటేల్ లు s అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో తోటి మిత్రులు లింగస్వామి, గసిగంటి రవీందర్, సురేందర్, కటకం సతీష్, అనిల్ రెడ్డి, బండి శ్రీనివాస్, ఈగ రాజు, రమేష్, శంకరమూర్తి, దాసరి సతీష్,, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు

Post A Comment: