మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్.

 

NTPC. IFTU కార్యాలయంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) పెద్దపెల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.

ఈ ప్రెస్ మీట్ లో IFTU జిల్లా అధ్యక్షులు ఈదునూరీ నరేష్ మాట్లాడుతూ భారత కార్మిక సంఘాల సమైక్య (IFTU) పెద్దపెల్లి జిల్లా 8వ జిల్లా మహాసభలు NTPC జ్యోతి నగర్ లో 2023.మార్చి 18,19 రెండు రోజులపాటు నిర్వహించడం జరుగుతోంది 

ఈ మహాసభలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 

గత నలభై ఏళ్ల నుండి ఈ జిల్లాలో IFTU నాయకత్వంలో సింగరేణి ,ఎన్టీపీసీ, బసంత నగర్ అమాలి రంగం ,భవన నిర్మాణరంగం, మోటార్ రంగం, కేజీబీవీ గ్రామపంచాయతీ, మున్సిపల్. తదితర రంగాలలో పనిచేస్తున్న కార్మికుల పక్షాన నిలబడి అనేక ఉద్యమాలు సమ్మె పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించింది.  ఎన్నో సంవత్సరాల నుండి  కార్మికులు పోరాడి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క కలం పోటుతో రద్దుచేసి నాలుగు కోడు లుగా కుదించి కార్మిక వర్గాన్ని పెట్టుబడి దారులకు కట్టు బానిసలుగా చేస్తున్న పరిస్థితి నెలకొంది.

లాభాల్లో నడుస్తున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పజెప్తూ కార్మికులను బజారు పాలు చేసేవిధానాలను కొనసాగిస్తున్నారన్నారు. ఈ తరుణంలో ఈ మహాసభల్ని  నిర్వహించుకుంటున్నామని ఈ మహాసభల్లో గత ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాలను రూపొందించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం చైతన్యవంతమై మీలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావలని పిలుపునిచ్చారు. కాబట్టి ఈ మహాసభ, బహిరంగ సభ లో మరియు కార్మిక ప్రదర్శన లో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ ప్రెస్ మీట్ లో PCKS జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్,lFTU జిల్లా నాయకులు మల్యాల దుర్గయ్య, బి బుచ్చయ్య, సిహెచ్ అబెద్నెగో, డి బుచ్చమ్మ,డి రాజేశం, కే మల్లేష్, కే లింగమూర్తి ,ఎం చంద్రయ్య,వి సదానందం,ఆరుముళ్ళ తిరుపతి,సమ్మెట తిరుపతి,డి రవి,వసంత్,మల్లేష్,రాం కీ,శివకుమార్,డి నర్సయ్య,సంపత్ తదితరంలు పాల్గోన్నొరు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: