మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (సిఐటియు) రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ శ్రామిక భవన్,గోదావరిఖనిలో జరిగింది. దీనికి కంపెటి రాజయ్య అధ్యక్షత వహించగాసింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు  హాజరయ్యారు. 

వారు మాట్లాడుతూ సింగరేణిలో అనేక సంవత్సరాలుగా వేలాదిమంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వీరు చాలీచాలని వేతనాలతో బాటుకుతున్నారని అన్నారు. దీనికి తోడు సొంత ఇండ్లు లేక వచ్చిన జీతంలో ఎక్కువ భాగం ఇంటి కిరాయిలకే సరిపోతుందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంట్రాక్టు కార్మికులు ఎలా బ్రతుకుతారని అన్నారు. సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులను వివిధ పనులకు వాడుకుని వదిలేయడం కాదు వారికి ఉండడానికి గూడు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 20 వేలకు పైగా క్వాటర్లు ఖాళీగా ఉన్నాయని వాటిని కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వడం వల్ల యాజమాన్యంకు

ఎం నష్టం వస్తుందో చెప్పాలని అన్నారు.సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మాత్రం ఖాళీ క్వాటర్లు ఇవ్వరు కానీ రాజకీయ నాయకులకు, సింగరేణికి సంబంధం లేని వారికి క్వాటర్లు ఎలా కేటాయిస్తారని యాజమాన్యంను ప్రశ్నించారు.అంతేకాకుండా సింగరేణికి సంబంధించిన భూములను చాలామంది కబ్జాదారులు కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నా యాజమాన్యానికి కండ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికులు తలదాచుకోవడానికి చిన్న గుడిసె వేసుకుంటే మాత్రం ఆగమేఘాల మీద వచ్చి దౌర్జనానికి పాల్పడి కూల్చేస్తున్నారని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సింగరేణిలో ఖాళీగా ఉన్న ఖాళీ క్వాటర్లు ఇవ్వాలని, అదేవిధంగా  సింగరేణిలో ఖాళీగా ఉన్న స్థలాలను  కాంట్రాక్టు కార్మికులకు ఇండ్ల స్థలాలకు కేటాయించాలి.లేదంటే లేదంటే సిఐటియు ఆధ్వర్యంలో ఖాళీ క్వాటర్లు,ఖాళీ స్థలాలు ఆక్రమించుతామని యాజమాన్యానికి హెచ్చరిక చేశారు.

అదేవిధంగా చట్టప్రకారం కార్మికుడికి 7వ తేదీలోపు రావాల్సిన జీతాలు,జీతం చిట్టీలు ఇవ్వాలని,ఇవ్వని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దీంతోపాటు 2019 నుండి రావాల్సిన సి.ఎం.పి.ఎఫ్.చిట్టీలు వెంటనే ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన జీ.ఓ. నెంబర్ 22 ని వెంటనే గెజిట్ చేసే విదంగా లేబర్ అధికారులు ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి కార్మికులకు పెరిగిన జీతాలు ఇచ్చే విదంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

లేదంటే సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన, పోరాటాలు ఉదృతం చేస్తామని అన్నారు.ఈసమావేశంలో రాష్ట్ర కోశాధికారి వేల్పుల కుమారస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగాని కృష్ణయ్య, కార్యదర్శులు ఉపేందర్,దూలం శ్రీనివాస్,

గద్దల శ్రీనివాస్,అంబాల ఓదెలు,

నాయకులు భూమయ్య,లక్ష్మీ నారాయణ, నందిని,లక్ష్మీ, మహేందర్,వేణు ప్రకాష్ తదితరులు పాల్గొన్నార.. 

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: