ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కంటివెలుగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం లష్కర్ సింగారం పరిధిలోని సెయింట్ పీటర్స్ స్కూల్, పోచమ్మకుంట పట్టణ ఆరోగ్యకేంద్రం, దామెర పీహెచ్‌సీ లోని కంటి వెలుగు కేంద్రలను తనిఖీ చేసారు .
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాన్ని కంటి సమస్యలతో బాధపడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటి వెలుగును పగడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సిబ్బంది అందరూ సమయానికి హాజరై శిబిరానికి వచ్చే ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన కంటి అద్దాలను అందజేయాలని సూచించారు.ఈ సంద ర్భంగా రికార్డులు, కంటి పరీక్షల నిర్వహణ, డాటా ఎంట్రీ చేసే విధానాన్ని పరిశీలించారు. ప్రతి రోజు 150మందికి తగ్గకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతిరోజు ఉదయం 8నుంచి సాయత్రం 4వరకు శిబిరాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో డిఎంహెచ్‌ఓ డాక్టర్ బి సాంబశివరావు, అడిషనల్ డిఎంహెచ్‌ఓ డాక్టర్ టి.మదన్మోహన్ రావు, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ చొక్కయ్య, డాక్టర్ తేజస్విని, డాక్టర్ దీప్తి, ఆప్తాల్మిక్ అధికారులు రవీందర్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: