ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

పేస్కేల్ అమలు చేయడం పట్ల సిఎం కేసిఆర్, మంత్రి ఎర్రబెల్లికి  సెర్ప్ ఉద్యోగులు

ధన్యవాదాలు తెలిపారు. 

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరింది. 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. 4వేల మంది ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం చిగురించింది. ఫలితంగా నేడు రాష్ట్రపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో ముఖ్యమంత్రి కేసిఆర్  చిత్రపటానికి సెర్ప్ ఉద్యోగులు పాలాభిషేకం చేసి తమ కృతజ్ణతను చాటారు. 

నేడు హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సెర్ప్ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిసి పూలమొక్క ఇచ్చి అభినందించారు. శాలువా కప్పి సన్మానించారు.

ఈ సందర్భంగా సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ ఇస్తామని 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని, 2022 మార్చి 15వ తేదీన అసెంబ్లీలో చేసిన ప్రకటనను నిలబెట్టుకున్న మహానుభావులు సిఎం కేసిఆర్ కి సెర్ప్ ఉద్యోగుల తరపున మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

గతంలో ప్రభుత్వాలు సెర్ప్ ఉద్యోగులను వాడుకున్నాయి తప్ప వారి డిమాండ్లను, కోరికలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే వారికి పేస్కేల్ అమలు కానుందన్నారు.

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్ధిక శాఖామాత్యులు  హరీష్ రావు తన ప్రసంగంలో సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేస్తామని ప్రకటించడం పట్ల వారికి ధన్యవాదాలు తెలిపారు.

సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ అమలు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఉద్యోగుల వేతనాలు కూడా గణనీయంగా పెరుగుతాయని, ప్రభుత్వంపై 58 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెంచిన పేస్కేల్ అమలులోకి వస్తుందని, ఇందుకోసం బడ్జెట్ ను 176 కోట్ల నుంచి 234 కోట్లకు పెంచుకోవడం జరిగిందన్నారు. 

సెర్ప్ ఉద్యోగుల సుదీర్ఘకాల డిమాండ్ నెరవేరడం పట్ల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి, సహకరించిన మంత్రులు  హరీష్ రావు,  కేటిఆర్, ఎమ్మెల్సీ కవితలకు తెలంగాణ సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు గంగాధర్ రెడ్డి, నర్సయ్య, సుభాష్, జానయ్య, సురేఖ, వెంకట్, గిరి, మధులు ధన్యవాదాలు తెలిపారు. 

ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి సమూలంగా గ్రామీణ పేదరిక నిర్మూలన చేసేందుకు కృషి చేస్తామన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: