మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

మహాదేవపూర్: బిజెపి చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మూడవరోజు మహాదేవపూర్, కుదురుపల్లి, ఎడపల్లి, బ్రాహ్మణ పెళ్లి, సమీప గ్రామాల లోని ప్రజల నుండి బిజెపి మంథని నియోజక వర్గ ఇన్చార్జ్ చందుపట్ల సునీల్ రెడ్డికి విపరీతమైన స్పందన లభిస్తుంది. జై బిజెపి, జై సునీలన్న కాబోయే ఎమ్మెల్యే సునీల్ రెడ్డి జిందాబాద్, సునీల్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తు బిజెపి జెండాలతో వాడవాడల నినాద శ్లోకాలతో మారుమోగిస్తున్నారు.ఈ పాదయాత్ర సందర్భంగా సునీల్ రెడ్డి అక్కడక్కడ ప్రసంగిస్తూ, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తండ్రి తనయుల పరిపాలన 40 సంవత్సరాలు, కీలకమైన పదవులలో ఉండి కూడా సొంత నియోజకవర్గమైన మంథని ప్రాంతా ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి చేసింది ఏమి లేదని, మొన్నటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు తోడ్పాటు అయ్యే అభివృద్ధి అందించింది ఏమీ లేదని, ప్రస్తుత బిఆర్ఎస్ లో జిల్లా పరిషత్ చైర్మన్ గా సొంత ప్రయోజనాలకే పరిమితం కాగా, ఈ ప్రాంత ప్రజలకు అవసరమైన అభివృద్ధి చేసింది మాత్రం శూన్యమని సునీల్ రెడ్డి అన్నారు. ఇరు పార్టీల,ఇరువురి నాయకుల పరిపాలన మాత్రం అభివృద్ధిని పక్కకు పెట్టి, ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ విమర్శనాస్త్రాలకే పరిమితమవుతున్నారని అన్నారు. ఇకనైనా ప్రజలంతా గమనించి అవినీతిలో మునిగితేలుతున్న ఇరు పార్టీలను మరిచి, దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ ప్రజలకు అండగా ఉంటుందని. రాబోయే ఎన్నికలలో కేంద్ర, రాష్ట్రాలలో ఏర్పడే ప్రభుత్వం బిజెపి అని, ఒకసారి మంథని నియోజకవర్గ ప్రజలంతా ఒకసారి మార్పు కోరుకొని బిజెపిని ఆదరించి, కమలం గుర్తుపై ఓటు వేసి నన్ను ఎంఎల్ఏ గా గెలిపిస్తే, ఈ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడే అభివృద్ధి పనులు చేసి చూపిస్తానని, ఆ అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రామిరెడ్డి, యాత్ర ప్రముఖ వెన్నంపల్లి పాపయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి, యాత్ర సహ ప్రముఖ దుర్గం తిరుపతి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీమన్నారాయణ, మండల ప్రధాన కార్యదర్శులు బొల్లం కిషన్, సూరం మహేష్, మంతిని రాజేందర్, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
Post A Comment: