ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం ధర్మసాగర్ పిహెచ్‌సిలో కంటి వెలుగు కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి విభాగాన్ని సందర్శించి కంటి పరీక్ష నిర్వహించే విధానం, ఆటోరిఫ్రాక్టర్ మరియు అద్దాలతో పరీక్ష విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాలను ప్రజల వినియోగించుకోవాలని, ఆశాలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పంచాయతీ సిబ్బంది 30 సంవత్సరాల పైబడిన వారిని క్యాంపులకు వచ్చే విధంగా చూడాలని అన్నారు. ఏ ఏ గ్రామంలో ఎప్పుడు క్యాంపు నిర్వహిస్తున్నారో ముందుగానే ప్రజలకు తెలియజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ బి సాంబశివరావు, స్థానిక ఎంపీపీ ఎన్. కవిత. సర్పంచ్ శరత్ చంద్ర, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ ఎండి యాకుబ్ పాషా, స్థానిక వైద్యాధికారి డాక్టర్ గోపీనాథ్, ఆప్తాలమిక్ అధికారులు రవీందర్ రెడ్డి, మల్లారెడ్డి సిహెచ్ఓ నెహ్రూచంద్, టీ మాధవరెడ్డి తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: