మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని రామగుండం నియోజకవర్గ కార్పోరేషన్ పరిధిలో హాత్ సే హత్ జోడో పాదయాత్రలో భాగంగా విజయవంతంగా 5 రోజుకు చేరుకుంది. 29 వ డివిజన్ అలాగే 8 వ డివిజన్లో విజయవంతంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు పెద్దలందరినీ పిల్లలందరినీ విద్యార్థులు అందరినీ యువకులందరినీ కర్షకులను కూలీలను ఉద్యోగస్తులను వర్తకులను కలుపుకు పోతూ ప్రతి ఒక్కరితో మమేకమై పొతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. Oc5 బ్లాస్టింగ్ ల వల్ల ధూళి కాలుష్యం ప్రజలు గుండె, కిడ్నీ అనేక ఆరోగ్య సమస్యల తోబాధపడుతున్నారు, ప్రశ్నించే వారిని టిఆర్ఎస్ పార్టీ వాళ్లు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు, దోపిడి తప్ప అభివృద్ధి లేదని అన్నారు, డివిజన్ ప్రజలు రాబోయే ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గ మా ఎమ్మెల్యే గా మిమ్మేల్నే గెలిపించుకుంటామని స్వచ్చందంగా ప్రజలంతా ముందుకోస్తుంటే ఒక ప్రక్క బావోద్వేగానికి గురవుతూ మరో ప్రక్క వారికి భరోసా కల్పిస్తూ రామగుండం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మీ కుటుంబ సభ్యునిగా మీలో ఒక్కడిగా మన ప్రాంత అభివృద్ధి కోసం అనునిత్యం
ప్రజాక్షేత్రంలో నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని మీ కోసమే నా ఈ జీవితం ప్రజాసేవకే అంకితం అని ఉద్వేగపూరితంగా ప్రసంగించుకుంటూ గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని ఎప్పుడు నేను ఎంతో మందికి సహాయం చేసిందే తప్పితే తిరిగి నేను ఎప్పుడు ఎవరిని సహాయం కోరలేదని కాకపోతే ఈసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఎన్నో ఏళ్ల నుంచి నిర్లక్ష్యానికి గురైన పారిశ్రామిక ప్రాంతానికి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని నేను మాటల్లో కాదు చేతల్లో నా పనే సమాధానం చెప్తుంది అని మాయ మాటలు చెప్పడం నటించడం నాకు చేతకాదని ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా అవసరమైతే పారిశ్రామిక ప్రాంత ప్రయోజనాల కోసం నా ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి పని చేసి చూపిస్తానని ఈ సందర్భంగా వార్డులోని ప్రజలకు తెలియజేసుకుంటూ దిగ్విజయంగా ముందుకు సాగుతుంది హాత్ సే జోడో పాదయాత్ర.
ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ వారి సతీమణి మనాలి ఠాకూర్ వీరి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మరియు కార్పొరేటర్లు గాధం విజయనంద్ md ముస్తఫా మాటూరు సత్య ప్రసాద్ చొప్పదండి దుర్గాప్రసాద్ తాళ్లపల్లి యుగంధర్ మేకల పోశం గట్ల రమేష్ ఉమ్మేతుల దేవేందర్ రెడ్డి మల్ రెడ్డి ఆషిప్ పాషా సీనియర్ నాయకులతో పాటు యువ నాయకులు నాజిమ్, కౌటాం సతీష్, కళ్యాణ్,సోషల్ మీడియా కోర్డినేటర్ సతీష్ దూళికట్ట గాదె సుధాకర్ బర్పటి శ్రీనివాస్ సింగం కిరణ్, రాయ మల్లు యాదవ్, గజ్జల నాగరాజ్ మరియు ప్రధాన మహిళా నాయకులతో పాటు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: