మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రోగ్రాంకు హాజరై, జంటను దీవించిన రామగుండం ప్రెస్ క్లబ్ సభ్యులు...
రామగుండం, ఫిబ్రవరి 10 (): సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో తండ్రి లేని నిరుపేద యువతికి ఎంగేజ్మెంట్ ప్రోగ్రాంను నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం 3వ, డివిజన్ పరిధిలోని న్యూ పోరటపల్లికి చెందిన తండ్రి లేని నిరుపేద యువతి జిమ్మిడి మాధురికీ శుక్రవారం ఉదయం 11 గంటలకు న్యూ పోరపల్లి గ్రామంలో సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంగేజ్మెంట్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పలువురు మహోత్సవానికి హాజరై నిండు మనసుతో నూతన జంటను ఆశీర్వదించారు. సమత ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిహెచ్ ప్రమీల, మాస రాజయ్య, ముడిమడుగుల మల్లన్న, పాగే భూమయ్య దుర్గం విశ్వనాధ్, దూట రాజు, జాడి వెంకటేష్, పాగే శ్రీనివాస్, రాంటెంకి శ్రీనివాస్, సమతా ఫౌండేషన్ సభ్యులు, రామగుండం ప్రెస్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: