ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన ఈవీఎం గోడౌన్ వద్ద భద్రత, సిబ్బంది హాజరు ఏప్పటిలాగే ఉండాలని అలాగే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు .
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతినెల ఈవీఎంలు భద్రపరిచిన గోదాముల తనిఖీ లో భాగంగా శుక్రవారం ఏనుమాముల మార్కెట్ ఆవరణలో ఉన్న ఈవీఎం గోదామును తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఈవీఎం గోదాము భద్రతకు నియమించిన సిబ్బంది హాజరు, అదేవిధంగా పోలీసు బందోబస్తు తదితర అంశాలను, ఈవీఎం ఆవరణ ను పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ వెంట, డిఆర్ఓ వాసుచంద్ర, ఎన్నికల విభాగం నుండి జ్యోతి వరలక్ష్మీ, సమ్మక్క, పార్టీ ప్రతినిధులు కాంగ్రెస్ నుండి ఇవి.శ్రీనివాస్, బీజేపీ నుండి అమరేందర్ రెడ్డి, బీఎస్పీ నుండి బి.సారయ్య,వైఎస్సార్ నుండి ఎన్. రజినీ కాంత్, ఏఐఎఎంఐఎం నుండి సయ్యద్ ఫైజుల్లా తదితర సిబ్బంది వున్నారు.

Post A Comment: