ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన కన్వీనర్ హరి ప్రసాద్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనైనది.
ఈ సమావేశంలో వివిధ శాఖల అనుమతుల జారి గురించి సమీక్షించారు, మరియు వివిధ ప్రభుత్వ శాఖల పరిశ్రమల అనుమతులు త్వరితగతిన జారీ చేయాలని ఆదేశించారు. గత నెల వ్యవధిలో 12 పరిశ్రమలు 8.69 కోట్ల పెట్టుబడితో 23 అనుమతులు కోరగా 18 అనుమతులు జారీ చేయనైనది.ఇందుకుగాను దాదాపు 90 మందికి ఉపాధి కల్పించబడును. టి ప్రైడ్ పథకం కింద 5 యూనిట్లకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 31. 5 0 లక్షల పెట్టుబడి పై 14. 77 లక్షల సబ్సిడీ మంజూరి చేయనైనది. ఇందువలన 10 మందికి ఉపాధి కల్పించనైనదని తెలిపినారు.
ఈ సమావేశంలో ఉప రవాణా కమీషనర్ పురుషోత్తం, గ్రామీణా మరియు పట్టణ ప్రణాళిక అధికారి రత్న కుమారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సునీత, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వెంకన్న, ఎల్ డిఎం శ్రీనివాస్, జోనల్ మేనేజర్ టిఎస్ఐఐసి సంతోష్, డిపిఓ జగదీశ్వర్, తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Post A Comment: